...
...
Next Story

Ustaad Bhagat Singh Collections: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాక్‌-దారుణంగా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ క‌లెక్ష‌న్లు-సండే తగ్గిన వసూళ్లు

Ustaad Bhagat Singh Collections: భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ కు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. సండే అయితే వసూళ్లు పడిపోవడం గమనార్హం.

Published on: Mar 23, 2026, 06:07:24 IST
Advertisement

వర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర షాకింగ్ రిజల్ట్ వస్తోంది. సండే ఈ మూవీ వసూళ్లు పడిపోవడం గమనార్హం.

ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లు

ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ లేెటెస్ట్ యాక్షన్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఎంతో హైప్ తో థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకు షాక్ తప్పలేదు. కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. నాలుగు రోజులు గడిచినా ఇండియాలో రూ.60 కోట్లు కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా.

నాలుగు రోజుల బాక్సాఫీస్ వసూళ్లు

ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ శనివారం ఇండియాలో రూ.9.05 కోట్ల నెట్ వసూలు చేయగా, ఆదివారం ఈ కలెక్షన్లు మరింత పడిపోయాయి. 4వ రోజైన సండే (మార్చి 22) ఈ మూవీ కేవలం రూ.6.59 కోట్ల నెట్ మాత్రమే ఖాతాలో వేసుకుంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమాకు ఫస్ట్ సండే ఇలాంటి కలెక్షన్లు ఊహించనివే.

ఆ సినిమాల కంటే తక్కువ

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ కల్యాణ్ గత సినిమాలకంటే దారుణమైన ప్రదర్శన చేస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లో 'హరి హర వీర మల్లు' మూవీ రూ.74.71 కోట్లు, ఓజీ చిత్రం రూ.130 కోట్లు వసూళ్లు సాధించాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం వెనుకబడింది.

ధురంధర్‌ 2తో పోటీ

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉగాది సందర్భంగా మార్చి 19, 2026న రిలీజైంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. బీజీఎం బాధ్యత తమన్ తీసుకున్నాడు.

పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో మరోసారి కనిపించడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ కలెక్షన్లు మాత్రం పూర్తిగా డిసప్పాయింట్ చేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks