...
...
Next Story

Ustaad Bhagat Singh OTT: ఓటీటీని తాకిన ప‌వ‌ర్ స్టార్ మేనియా.. ఇవాళ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Apr 16, 2026, 05:42:03 IST
Advertisement

Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పవర్ స్టార్ మేనియా మరోసారి ఓటీటీని తాకింది. ఈ పోలీస్ యాక్షన్ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ

పవన్ కల్యాణ్, శ్రీలీల
పవన్ కల్యాణ్, శ్రీలీల

పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. వీళ్ల కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ గబ్బర్ సింగ్ సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఈ చిత్రం గురువారం (ఏప్రిల్ 16) ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

అంచనాలు అందుకోలేక

ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మరోసారి పోలీస్ గెటప్ లో యాక్షన్ తో అదరగొట్టాడు. ఇందులో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలు అందుకోలేకపోయింది. రూ.100 కోట్ల కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది.

పాన్ ఇండియా లెవల్లో

థియేటర్లలో తెలుగులోనే రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీలో మాత్రం పాన్ ఇండియా ఫ్యాన్స్ కు అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ

కట్ చేస్తే చంద్రశేఖర్ రావు సీఎం అవుతాడు. అయితే చెదలమర్రి నల్లనాగప్ప (పార్తిబన్) సీఎం పీఠంపై కన్నేస్తాడు. చంద్రశేఖర్ రావును ఎలాగైనా అడ్డు తప్పించాలని చూస్తాడు. అతని నుంచి చంద్రశేఖర్ రావును ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కల్యాణ్) ఎలా కాపాడాడు అన్నదే సింపుల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టోరీ.

ఫ్యాన్స్ కు ట్రీట్

బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్ చతికిలపడింది. కానీ ఈ మూవీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. పవన్ కల్యాణ్ డ్యాన్స్ తో, యాక్షన్ తో ఇరగదీశాడు. ఇద్దరు హీరోయిన్లతో మంచి కెమిస్ట్రీ కూడా పండించాడు. పోలీస్ గెటప్ లో పవ్ కల్యాణ్ యాక్టింగ్ కచ్చితంగా అభిమానులను ఉర్రూతలూగించేదే. ఇంకెందుకు లేటు మరి ఓటీటీలో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఓ లుక్కేయండి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe