OTT Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్- 8.1 రేటింగ్- కిడ్నాప్ చేసి ట్రాప్‌లో పడే కల్ట్ గ్యాంగ్
OTT Telugu Crime Thriller Uttutta Herolu Streaming Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఉత్తుత్త హీరోలు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. యూట్యూబ్, బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా హీరోగా మారిన ఈ సినిమాకు 8.1 రేటింగ్ ఉంది. మరి ఉత్తుత్త హీరోలు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Today OTT Telugu Crime Thriller Release: యూట్యూబ్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి 'బిగ్ బాస్ తెలుగు' రియాలిటీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ మహేష్ విట్టా. వెండితెరపై ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో నవ్వించిన మహేష్.. ఇప్పుడు హీరోగా సరికొత్త అవతారమెత్తారు.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్
మహేష్ విట్టా లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ 'ఉత్తుత్త హీరోలు'. తెలుగులో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఉత్తుత్త హీరోలు సినిమాకు హర్ష కొడాలి దర్శకత్వం వహించారు. మహేష్ విట్టా హీరోగా చేసిన ఈ సినిమాలో ప్రవీణ సోనీ హీరోయిన్‌గా చేసింది. తను కొణిదెల, హర శ్రీనివాస్, వాల్తేరు వినయ్, గంగా చిటికెల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమాను మహేష్ విట్టా, కౌశిక్ రెడ్డ నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన ఉత్తుత్త హీరోలు సినిమా మొదట్లో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దాంతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది ఉత్తుత్త హీరోలు సినిమా. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి ఏకంగా 8.1 రేటింగ్ సాధించి సత్తా చాటింది ఉత్తుత్త హీరోలు మూవీ.
నేటివిటీ, కథా బలం తోడైతే
రాయలసీమ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆ ప్రాంత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు ఊహించని విధంగా హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. చిన్న బడ్జెట్ సినిమాలకు స్థానిక నేటివిటీ, కథా బలం తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం రాయలసీమలో నిరూపించింది.
నాటకరంగ నేపథ్యం ఉన్న నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా, వారి యాస, భాష, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే, ఉత్తుత్త హీరోలు సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌పై అప్పట్లో మహేష్ విట్టా స్పందించాడు.
సీమ గడ్డపై 'ఉత్తుత్త హీరోలు' రచ్చ
"ఈ ప్రాంతం (రాయలసీమ)లో సినిమా బాగా ఆడుతుందని ఆశించాం, కానీ ఈ స్థాయి సునామీ సృష్టిస్తుందని అస్సలు ఊహించలేదు. వీక్షకుల నోటి టాక్ ద్వారా సినిమా కలెక్షన్లు క్రమంగా పెరుగుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సానుకూల వాతావరణం మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని నమ్ముతున్నాను. మాది సరికొత్త టీమ్, రాత్రింబగళ్లు కష్టపడి ఈ సినిమాను రూపొందించాం, ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇప్పుడు దక్కుతోంది" అని మహేష్ విట్టా ఆనందం వ్యక్తం చేశారు.
ఇలా రాయలసీమలో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఉత్తుత్త హీరోలు ఓటీటీలోకి ఇవాళ (మే 21) వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఉత్తుత్త హీరోలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన చాలా వరకు సినిమాల్లో ఉత్తుత్త హీరోలు స్పెషల్ ఇంట్రెస్ట్‌గా తెలుగు ఆడియెన్స్‌కు మారింది.
ఉత్తుత్త హీరోల కథ
కాగా, ఒక గ్రామంలో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. కల్ట్ గ్యాంగ్ అని పేరు పెట్టుకున్న ఆ నలుగురిని ఉత్తుత్త హీరోలు అని గ్రామస్థులు ఏడిపిస్తుంటారు. అందుకు కారణం వారు సినిమా తీస్తామని గొప్పలు పోయి తీయకపోవడమే. ఆ నలుగురు ఫ్రెండ్స్‌కు సినిమా అంటే ప్యాషన్. హీరో, విలన్, కమెడియన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా సినిమాల్లో మెప్పించాలని కలలు కంటారు.
అందుకోసం సినిమా తీయాలని నిర్ణయించుకుంటారు. కానీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా తీయలేకపోతారు. దాంతో డబ్బుకోసం కిడ్నాప్ చేస్తారు. కానీ, ఆ కిడ్నాప్‌తో వాళ్లు భయంకరమైన ట్రాప్‌లో పడిపోతారు. ఆ కల్ట్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి ట్రాప్‌లో ఎలా పడ్డారు అసలు ఏమైంది ఆ ట్రాప్ ఏంటీ దాని నుంచి బయటపడ్డారా ఫైనల్‌గా సినిమాను తెరకెక్కించారా అనేదే ఉత్తుత్త హీరోలు కథ.
ఈటీవీ విన్ ఓటీటీలో
మరి కామెడీ, క్రైమ్, సస్పెన్స్ అంశాలతో మిళితమైన ఈ ఉత్తుత్త హీరోలు సినిమాలు ఈటీవీ విన్ ఓటీటీలో నేటి నుంచి ఎంచక్కా చూసేయండి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


