...
...
Next Story

OTT Crime: ఓటీటీలో మరో బిగ్ సర్‌ప్రైజ్- సంచలన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది- తెలుగులో స్ట్రీమింగ్!

Vadhandhi Season 2 OTT Streaming: ఓటీటీలో విశేష ఆదరణ పొందిన సంచలన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. సీజన్ 2తో హీరోను మార్చిన మేకర్స్ వదంది ది మిస్టరీ ఆఫ్ మణి ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. మరి వదంది 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసుకుందాం.

Published on: Jul 27, 2026, 20:14:26 IST
Advertisement

Vadhandhi Season 2 OTT Release Date: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు అమేజాన్ ప్రైమ్ వీడియో తీపి కబురు అందించింది. తమిళంలో రూపొంది, తెలుగులోనూ విశేష ఆదరణ దక్కించుకున్న ప్రతిష్టాత్మక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్ 'వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని' రెండో భాగానికి రంగం సిద్ధమైంది.

ఓటీటీలోకి వదంది 2

ఓటీటీలో మరో బిగ్ సర్‌ప్రైజ్- సంచలన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది- తెలుగులో స్ట్రీమింగ్!
ఓటీటీలో మరో బిగ్ సర్‌ప్రైజ్- సంచలన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది- తెలుగులో స్ట్రీమింగ్!

మొదటి సీజన్‌తో ఓటీటీ ప్రపంచంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన ఈ సిరీస్ నుంచి 'వదంది సీజన్ 2' త్వరలోనే రాబోతున్నట్లు నిర్వాహకులు అధికారికంగా తాజాగా వెల్లడించారు.

యువతి దారుణ హత్య చుట్టూ

తమిళ సినీ రంగంలో 'విక్రమ్-వేద', 'సుడల్' వంటి సూపర్ హిట్ ప్రాజెక్టులు అందించిన ప్రసిద్ధ ద్వయం పుష్కర్-గాయత్రి తమ 'వాల్‌వాచర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించారు. ఆండ్రూ లూయిస్ సృష్టించి, దర్శకత్వం వహించిన ఈ కథ ఒక యువతి దారుణ హత్య చుట్టూ అల్లుకున్న వదంతులు, సమాజపు కోణాలు, పోలీసు విచారణను అత్యంత ఉత్కంఠభరితంగా చూపించనుంది.

'వదంది' అంటే ఏమిటి? అసలు కథేంటి?

తమిళ భాషలో 'వదంది' అంటే వదంతు లేదా పుకారు అని అర్థం. కన్యాకుమారి అందాల నేపథ్యంతో సాగే ఈ కథలో వెలోని (సంజన కృష్ణమూర్తి) అనే యువతి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేస్‌ను ఛేదించడానికి రంగంలోకి దిగిన నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి వివేక్ (ఎస్‌.జె. సూర్య) ఎదుర్కొన్న సవాళ్లు ఈ సిరీస్ ప్రధానాంశం.

నిజాలు తెలుసుకోకుండా

ఒక దారుణం జరిగినప్పుడు నిజాలు తెలుసుకోకుండా సమాజం ఎలాంటి రూమర్లు అల్లుతుంది, ఒక మహిళ పట్ల ప్రజల ఆలోచనా తీరు ఎలా ఉంటుందనే అంశాలను దర్శకుడు ఎంతో లోతుగా స్పృశించారు. "వదంతులు నిజం కంటే వేగంగా ప్రయాణిస్తాయి. విచారణలో వెలుగు చూసే నిజాన్ని సైతం సమాజం తనలోని అపనమ్మకాలతో ఎలా మార్చేస్తుందో ఈ సిరీస్ అద్భుతంగా చూపించింది" అని సినీ విమర్శకులు కొనియాడారు.

ఎస్‌.జె.సూర్య నటన.. మేకర్స్ మ్యాజిక్

లైలా, నాజర్, వివేక్ ప్రసన్న, స్మృతి వెంకట్ వంటి నటీనటులు తమ నటనతో ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. తొలి భాగం ముగింపు తర్వాత మళ్లీ వివేక్ పాత్ర ఏ కొత్త కేసుతో రాబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, వివేక్ పాత్రలో ఈసారి ఎస్‌జే సూర్యకు బదులు తమిళ పాపులర్ నటుడు శశికుమార్ మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారు.

వదంది 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్

అంటే, హీరో మారాడు, కథ మారిందని తెలుస్తోంది. పుష్కర్-గాయత్రి శైలికి తగినట్లుగా కథలో లోతైన సామాజిక కోణాలు, ఉత్కంఠభరితమైన సీన్లు ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఫస్ట్ సీజన్‌లాగే అమెజాన్ ప్రైమ్‌లో వదంది ది మిస్టరీ ఆఫ్ మణి ఓటీటీ రిలీజ్ అవనుంది. ఆగస్ట్ 7 నుంచి వదంది 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా వెల్లడించారు మేకర్స్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks