OTT Release: డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో విజయ్ ఆంటోని. అతను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’. తమిళంలో ‘నూరు సామి’గా రిలీజైన ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.
వంద దేవుళ్లు ఓటీటీ

‘బిచ్చగాడు’ సినిమా విడుదలైన 10 సంవత్సరాల తర్వాత విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబోలో వచ్చిన సినిమా ఇది. భావోద్వేగ కుటుంబ కథా చిత్రంగా వంద దేవుళ్లు తెరకెక్కింది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
ఫుల్ ఎమోషన్స్
‘వంద దేవుళ్లు’ (నూరు సామి) చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్ దాస్ తదితరులు నటించారు. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రంలో భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథనం, ఆకట్టుకునే నటన, సమకాలీన సామాజిక అంశాలను సున్నితంగా చూపించిన తీరు కోసం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
రియల్ ఇన్సిడెంట్లు
నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ వంద దేవుళ్లు చిత్రం విధవరాలైన తల్లి సెల్వి కథను ఆవిష్కరించింది. భర్త మరణం తర్వాత పిల్లలను పెంచి పెద్ద చేసే క్రమంలో జీవితాన్ని అంకితం చేసిన ఆమె.. పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత జీవితంలో తోడుగా ఎవరో కావాలనుకుంటుంది.
అలాంటి సమయంలో సమాజంలోని పాత సాంప్రదాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వంద దేవుళ్లు’ మూవీ మాతృత్వం, గౌరవం, కఠిన నిర్ణయాలను అంగీకరించే విధానం, సామాజికంగా ఎదురయ్యే సమస్యలు, ధైర్యం వంటి అంశాల కలయికగా హృదయాన్ని కదిలించే కథగా తెరకెక్కించారు.
తల్లి కోసం
{{/usCountry}}అలాంటి సమయంలో సమాజంలోని పాత సాంప్రదాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వంద దేవుళ్లు’ మూవీ మాతృత్వం, గౌరవం, కఠిన నిర్ణయాలను అంగీకరించే విధానం, సామాజికంగా ఎదురయ్యే సమస్యలు, ధైర్యం వంటి అంశాల కలయికగా హృదయాన్ని కదిలించే కథగా తెరకెక్కించారు.
తల్లి కోసం
{{/usCountry}}వంద దేవుళ్లు సినిమా కథను గమనిస్తే.. సాంప్రదాయ ధోరణులను దాటి కొత్తగా ఆలోచింపజేసే తల్లి, కొడుకు బంధం తెలుస్తుంది. సాధారణంగా తల్లి త్యాగాలను మాత్రమే ప్రశంసించే కథలకంటే భిన్నంగా, ‘వంద దేవుళ్లు’ (నూరు సామి)లో తన తల్లికి అండగా నిలబడి ఆమె జీవితం సంతోషంగా ఉండటానికి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సహించే కొడుకు ఎలా ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తుంది.
చాలా స్పెషల్
విజయ్ ఆంటోని ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతి సినిమాకీ ఒక లక్ష్యం ఉంటుంది. కానీ ‘వంద దేవుళ్లు’ సినిమా నాకెంతో స్పెషల్. ఎందుకంటే ఇందులో ఉన్న భావోద్వేగాలు చాలా లోతైనవి. ఈ కథలో తల్లి, కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ప్రధానంగా నిలుస్తుంది. సినిమాలో ఉన్న సందేశంతో ప్రేక్షకులు గాఢంగా కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నా’’ అని అన్నాడు.