...
...
Next Story

అఫీషియల్‌గా వార‌ణాసి టైటిల్‌- అదిరిపోయిన వీడియో- ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో మ‌హేష్ బాబు- పేరు ఇదే- రిలీజ్ ఎప్పుడంటే?

గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో ఫ్యాన్స్ కు రాజమౌళి అదిరే సర్ ప్రైజ్ ఇచ్చారు. మూవీ టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు స్పెషల్ వీడియో లాంఛ్ చేశారు. ఇందులో విజువల్స్ అదిరిపోయాయి.

Published on: Nov 15, 2025, 21:36:22 IST
Advertisement

అఫీషియల్.. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు ‘వారణాసి’. ఈవెంట్ స్టార్ట్ కావడానికి ముందే అక్కడి స్క్రీన్ లపై ఈ పేరు వచ్చింది. ఇప్పుడు అఫీషియల్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇవాళ (నవంబర్ 15) జరుగుతున్న గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో ఫ్యాన్స్ కు రాజమౌళి అదిరే సర్ ప్రైజ్ ఇచ్చారు. ట్రైలర్ విజువల్ ట్రీట్ గా ఉంది.

వారణాసి ట్రైలర్

మహేష్ బాబు (jiohotstar)
మహేష్ బాబు (jiohotstar)

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో 100 అడుగుల స్క్రీన్ పై ప్రదర్శించారు. ఇది విజువల్ ట్రీట్ గా ఉంది. అంటార్టికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, లంకా నగరం, వారణాసి.. ఇలా వేర్వేరు ప్రదేశాలను దాటుతూ చివర్లో ఎద్దుపై మహేష్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకుని రావడం కనిపించింది. ఆ తర్వాత వారణాసి అని టైటిల్ డిస్ ప్లే అయింది.

రుద్రగా మహేష్ బాబు

వారణాసి సినిమా నుంచి ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్‌ ను విలన్ కుంభగా, ప్రియాంక చోప్రాను హీరోయిన్ మందాకినిగా పరియం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు వారణాసి మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ఇందులో ఆయన రుద్ర అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అంతకుముందు ఈ సినిమా 2027 సమ్మర్ లో రిలీజ్ అవుతుందని కీరవాణి వెల్లడించారు.

టెక్నికల్ ప్రాబ్లెం

100 అడుగుల స్క్రీన్ పై ఫుల్ లెవల్ గా ట్రైలర్ ప్రదర్శించాలనుకున్నారు. కానీ టెక్నికల్ ప్రాబ్లెం కారణంగా అది లేటైంది. అందుకు కారణాన్ని కూడా డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు.

‘‘చాలా మంది కష్టం, డబ్బు ఇందులో ఉంది. మా వీడియోను టెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. లీక్ అవ్వకూడదని అనుకున్నాం. డైరెక్ట్ గా ప్లే చేద్దామనుకున్నాం. కానీ వర్కౌట్ అవట్లేదు. పవర్ సరిపోవట్లేదు. మరో 10 నిమిషాలు ఓపిక పట్టండి’’ అని చెప్పారు. ఆ తర్వాత ప్లే చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks