Aha Ott: ‘నా వైఫ్ మిస్సింగ్’ అని అంటున్నాడు టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్. పక్కనే వితికా ను పెట్టుకొని వైఫ్ ఎక్కడ? అని అడుగుతున్నాడు ఏంటీ? అనుకుంటున్నారు. ఇదంతా వరుణ్ సందేశ్ కొత్త సినిమా గురించే. అతను ఓటీటీ కోసం ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది.
నా వైఫ్ ఎక్కడ?

పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒరిజినల్ మూవీస్, సిరీస్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే క్రమంలో మిస్టరీ థ్రిల్లర్ గా ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే ఆహా ఒరిజినల్ మూవీ రాబోతుంది. ఇందులో వరుణ్ సందేశ్ హీరో. ఈ ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ కోసమే తెరకెక్కిస్తున్నారు.
ఫొటోలు వైరల్
ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతున్న ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే మూవీ షూటింగ్ శనివారం (మే 2) ప్రారంభమైంది. ఈ మూవీ పూజ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు వరుణ్ సందేశ్ భార్య వితికా కూడా అటెండ్ అయింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓటీటీపై ఫోకస్
‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’ లాంటి సినిమాలతో యూత్ లో బాగా క్రేజ్ దక్కించుకున్న హీరో వరుణ్ సందేశ్. కానీ ఆ తర్వాత అతని కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు. డిఫరెంట్ స్టోరీ, విభిన్నమైన కాన్సెప్ట్ లతో మూవీస్ చేసినా ఫలితం మాత్రం నెగెటివ్ గానే వచ్చింది. దీంతో వరుణ్ సందేశ్ ఇప్పుడు ఓటీటీపై ఫోకస్ పెట్టాడు.
ఆ సిరీస్ సక్సెస్ తో
{{/usCountry}}‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’ లాంటి సినిమాలతో యూత్ లో బాగా క్రేజ్ దక్కించుకున్న హీరో వరుణ్ సందేశ్. కానీ ఆ తర్వాత అతని కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు. డిఫరెంట్ స్టోరీ, విభిన్నమైన కాన్సెప్ట్ లతో మూవీస్ చేసినా ఫలితం మాత్రం నెగెటివ్ గానే వచ్చింది. దీంతో వరుణ్ సందేశ్ ఇప్పుడు ఓటీటీపై ఫోకస్ పెట్టాడు.
ఆ సిరీస్ సక్సెస్ తో
{{/usCountry}}ఇప్పటికే వరుణ్ సందేశ్ ఓటీటీ డెబ్యూ చేశాడు. జీ5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ‘నయనం’ సిరీస్ లో కీలక పాత్ర పోషించాడు. ఇందులో ఓ సైకో కళ్ల డాక్టర్ గా వరుణ్ సందేశ్ నటించాడు. తను స్పెషల్ గా డిజైన్ చేసిన కళ్లద్దాలతో నాలుగు నిమిషాల పాటు అవతలి వాళ్లు ఏం చేస్తున్నాడో చూస్తాడు. ఈ క్రమంలోనే ఓ హత్య జరుగుతుంది.
సైకో మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ‘నయనం’ వెబ్ సిరీస్ హిట్ గా నిలిచింది. 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను ఈ సిరీస్ దాటేసింది. ఈ నయనంతో హిట్ అందుకున్న వరుణ్ సందేశ్.. ఇప్పుడు అదే జోష్ తో ఆహా వీడియో ఓటీటీ కోసం మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడు.