టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. చెల్లి నిహారిక కొణిదెల ప్రొడక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. వాలీబాల్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా పేరు ‘బరి’. ఈ రోజు (మార్చి 28) ఈ సినిమా షూటింగ్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. దీనికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు.
వరుణ్ తేజ్ కామెంట్లు

బరి సినిమా షూటింగ్ లాంఛ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ గెస్ట్ గా రావడంపై వరుణ్ తేజ్ సంతోషం వ్యక్తం చేశాడు. బాబాయ్ రావడం కిక్కు అని పేర్కొన్నాడు. ‘‘ఈ సినిమా చాలా స్పెషల్. నిహా (నిహారిక)తో కొలబరేట్ కావడం ఎంతో స్పెషల్. అలాగే యంగ్ డైరెక్టర్ యధు వంశీతో మూవీ చేయడం ఇంకా స్పెషల్. కమిటీ కుర్రాళ్లు చూసినప్పటి నుంచి డైరెక్టర్ ను అడ్మైర్ చేస్తున్నా’’ అని వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.
బాబాయ్ రావడం
‘‘కథ విన్నప్పటి నుంచి ఈ సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఈ బరి మూవీ వచ్చే సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతుంది. కల్యాణ్ బాబాయ్ దగ్గరగా నేను, నిహా కలిసి వెళ్లాం. ‘ఏంటీ? వరుణ్ తో సినిమా చేస్తున్నావా?’ అని బాబాయ్ అడిగారు. అవును అని చెప్తే నైస్ అన్నారు. షూటిింగ్ ఈవెంట్ కు రావాలంటే సరేనన్నారు. బాబాయ్ రావడమే కిక్కు’’ అని వరుణ్ తేజ్ తెలిపాడు.
చాలా స్పెషల్
అన్నయ్య వరుణ్ తేజ్ తో చేస్తున్న ఈ సినిమా చాలా స్పెషల్ అని నిహారిక చెప్పింది. ‘‘మా ప్రొడక్షన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. సెకండ్ టైమ్ యధు వంశీతో కొలబరేట్ అవుతున్నా. మాది ఆల్మోస్ట్ సేమ్ టీమ్. నేను చేసిన కమిటీ కుర్రాళ్లు, రాకాస స్పెషల్ అని చెప్పా. అయితే ఇది ఇంకా స్పెషల్ మూవీ. అన్నయ్యతో చేస్తున్నా’’ అని నిహారిక తెలిపింది.
{{/usCountry}}అన్నయ్య వరుణ్ తేజ్ తో చేస్తున్న ఈ సినిమా చాలా స్పెషల్ అని నిహారిక చెప్పింది. ‘‘మా ప్రొడక్షన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. సెకండ్ టైమ్ యధు వంశీతో కొలబరేట్ అవుతున్నా. మాది ఆల్మోస్ట్ సేమ్ టీమ్. నేను చేసిన కమిటీ కుర్రాళ్లు, రాకాస స్పెషల్ అని చెప్పా. అయితే ఇది ఇంకా స్పెషల్ మూవీ. అన్నయ్యతో చేస్తున్నా’’ అని నిహారిక తెలిపింది.
{{/usCountry}}‘‘బరి మూవీ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో రాబోతుంది. ఈ సారి సంక్రాంతి బరిలో మేం కూడా అఫీషియల్ గా ఉన్నాం. 2027 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది’’ అని నిహారిక పేర్కొంది.
మూడో సినిమా
కమిటీ కుర్రాళ్లు సినిమాతో ప్రొడ్యూసర్ గా నిహారిక తన జర్నీ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత రాకాసను నిర్మించింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడేమో అన్నయ్యతో ‘బరి’ని స్టార్ట్ చేసింది. మరోవైపు వరుణ్ తేజ్ హారర్ మూవీ కొరియన్ కనకరాజు సినిమా కూడా చేస్తున్నాడు.