Varun Tej Nagababu Bhari Niharika Konidela: మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ ఒకటి ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఆయన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బరి’.
బరి సినిమాలో నాగబాబు

ఈ బరి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు, వార్తలు ఇప్పటికే అంచనాలను పెంచేయగా, తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో వరుణ్ తేజ్ తండ్రి, సీనియర్ నటుడు నాగబాబు కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
తొలిసారి నిజజీవిత తండ్రీకొడుకులు ఒకే తెరపై!
వెండితెరపై మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇప్పటివరకు తండ్రి నాగబాబుతో కలిసి పూర్తిస్థాయిలో నటించే అవకాశం రాలేదు. ఇప్పుడు 'బరి' చిత్రంతో ఆ ముచ్చట తీరబోతోంది. రియల్ లైఫ్ తండ్రీకొడుకులు తొలిసారి వెండితెరను పంచుకోబోతుండటం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.
అలాగే, సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ విషయం బిగ్గెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే, విదేశాల్లో ఉన్న అభిమానులతో వరుణ్ తేజ్ ఇటీవల నిర్వహించిన ప్రత్యేక జూమ్ (Zoom) ఇంటరాక్షన్‌లో ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
మా నాన్నగారు కూడా
"మా నాన్న నాగబాబు గారు కూడా 'బరి' సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు" అని వరుణ్ తేజ్ అభిమానులతో పంచుకున్నారు. వరుణ్ నోటి నుంచి ఈ మాట రాగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
నిహారిక కొణిదెల నిర్మాతగా భారీ సినిమా
హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నిహారిక కొణిదెల, ఆ తర్వాత నిర్మాతగా మారి వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తున్నారు. 'పింక్ ఎలిఫెంట్ క్రియేషన్స్' బ్యానర్‌పై చిన్న సినిమాల నుంచి ఓటీటీ కంటెంట్ వరకు నిర్మించి విజయాన్ని అందుకున్నారు.
{{/usCountry}}హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నిహారిక కొణిదెల, ఆ తర్వాత నిర్మాతగా మారి వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తున్నారు. 'పింక్ ఎలిఫెంట్ క్రియేషన్స్' బ్యానర్‌పై చిన్న సినిమాల నుంచి ఓటీటీ కంటెంట్ వరకు నిర్మించి విజయాన్ని అందుకున్నారు.
{{/usCountry}}ఇప్పుడు తన సోదరుడు వరుణ్ తేజ్ హీరోగా, తండ్రి నాగబాబు ప్రధాన పాత్రలో 'బరి' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ బరి సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
బరిలో ఎలా కనిపిస్తారో
బరి సినిమాలో నటించే ఇతర నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. కంటెంట్ ఆధారిత కథలతో ఆకట్టుకునే వరుణ్ తేజ్, ఈ 'బరి'లో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. మిరాయ్ బ్యూటీ రితిక నాయక్ హీరోయిన్‌గా చేసింది. కడుపుబ్బా నవ్వించే కమెడియన్ సత్య హీరో ఫ్రెండ్‌గా చేస్తున్నాడు.
కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఆగస్ట్ 7న కొరియన్ కనకరాజు సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అంటే, రేపే థియేటర్లలో కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.