...
...
Next Story

Venkatesh Kalyan Ram: వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గ్రాండ్ లాంచ్.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. హీరోయిన్లు ఫిక్స్

Venkatesh Kalyan Ram Movie: టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ల క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. 2027 సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చే ఈ మూవీ కోసం అనిల్ రావిపూడి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Jun 18, 2026, 11:38:26 IST
Advertisement

Venkatesh Kalyan Ram Movie: టాలీవుడ్‌లో కమర్షియల్ వినోదానికి, ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి నెక్ట్స్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోలుగా పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం పూజా కార్యక్రమాలు నేడు (జూన్ 18, 2026) హైదరాబాద్‌లో ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి.

క్రేజీ ప్రాజెక్ట్‌లోకి కీర్తి సురేష్, కృతి శెట్టి

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గ్రాండ్ లాంచ్.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. హీరోయిన్లు ఫిక్స్ (x/SureshProdns)
వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గ్రాండ్ లాంచ్.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. హీరోయిన్లు ఫిక్స్ (x/SureshProdns)

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్- కళ్యాణ్ రామ్ సినిమా ప్రారంభోత్సవం రోజే హీరోయిన్లకు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చి మేకర్స్ హైప్ పెంచేశారు. జాతీయ అవార్డు గ్రహీత, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇందులో వెంకటేష్ సరసన జోడీ కట్టబోతోంది.

అలాగే యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఏమో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కథానాయికగా ఎంపికైంది. టెక్నికల్‌గా ఈ చిత్రానికి #VenkyAnil5, #NKRAR2 అనే వర్కింగ్ టైటిల్స్ ఖరారు చేశారు.

ఫస్ట్ సీన్ తోనే

అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్లు, చేసే ఈవెంట్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ పూజ కార్యక్రమంలోనూ డిఫరెంట్ మార్క్ కనిపించింది. ఈ సారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఫస్ట్ సీన్ డైరెక్ట్ చేశారు. అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఫస్ట్ ఏమో వెంకీ పక్కన కృతి శెట్టి, కళ్యాణ్ రామ్ పక్కన కీర్తి సురేష్ నిలబడి ఉంటారు. వీళ్లు ఒకరినొకరు చూసుకుని కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే ఎవరి బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వాళ్లు వస్తారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

డబుల్ డోస్ వినోదం

మెగాస్టార్ చిరంజీవితో తీసిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు సాధించి పీక్ ఫామ్‌లో ఉన్నాడు అనిల్ రావిపూడి. ఇదే జోష్ లో వెంకటేష్- కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ సినిమాను వచ్చే 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే దీని వెనుక ఒక పక్కా కమర్షియల్ మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పొచ్చు.

అన్ని రకాలుగా

వెంకటేష్‌కు ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్‌లో తిరుగులేని పట్టుంది. అదే సమయంలో కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన సినిమాలతో పాటు నందమూరి మాస్ బ్రాండ్ ఇమేజ్‌ను మోసుకొస్తాడు. ఈ క్లాస్ + మాస్ ఈక్వేషన్‌కు అనిల్ రావిపూడి మార్క్ అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ కామెడీ తోడైతే సంక్రాంతి లాంటి బిగ్గెస్ట్ సీజన్‌లో థియేటర్లు కలెక్షన్లతో కళకళలాడటం ఖాయం.

పైగా సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్స్, జీ స్టూడియోస్ సౌత్ లాంటి భారీ నిర్మాణ సంస్థలు చేతులు కలపడం వల్ల థియేటర్ల అలొకేషన్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ చాలా సేఫ్ జోన్‌లో ఉంది. ఈ సినిమాకు సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks