Adarsha Kutumbam AK47: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK47). ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం విడుదల చేసిన గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అచ్చు అనిల్ రావిపూడి- వెంకటేష్ సినిమాలా ఉందే అనే ట్రోల్స్ వస్తున్నాయి.
అనిల్ రావిపూడి స్టైల్

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం నుంచి వరుసగా పాత్రలను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే వింటేజ్ వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాటల మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. ఈ గ్లింప్స్ చూశాక దర్శకుడు అనిల్ రావిపూడి కాన్సెప్ట్ ఫ్రస్ట్రేషన్ కామెడీ శైలి గుర్తుకొస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
'చిట్టిబాబు' ఫ్రస్ట్రేషన్
ఇటీవల ఆదర్శ కుటుంబం చిత్రం నుంచి వెంకటేష్ పోషిస్తున్న 'చిట్టిబాబు' పాత్ర పరిచయంతో పాటు, శ్రీనిధి శెట్టి (స్వర్ణ) గ్లింప్స్‌ను నిర్మాతలు పంచుకున్నారు. ఇందులో భార్యాబాధితుడిగా వెంకటేష్ చూపించే కామెడీ ఫ్రస్ట్రేషన్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తున్నాయి.
అయితే, 'ఎఫ్ 2', ‘ఎఫ్ 3’, 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాల్లో వెంకీ-అనిల్ రావిపూడి కాంబో తెచ్చిన మార్క్ కామెడీ ఫ్రస్ట్రేషన్ నమూనాలోనే ఈ సన్నివేశాలు సాగుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అనిల్ సినిమాలాగే ఈ చిత్రం ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.
కారణం ఇదే
ఇప్పటివరకూ ఆదర్శ కుటుంబం నుంచి రిలీజ్ చేసిన రెండు గ్లింప్స్ వీడియోలు కామెడీగానే ఉన్నాయి. ఓ పెద్ద ఇంట్లో భార్యాభర్తల మధ్య సెటైర్లు, ఫ్రస్టేషన్ తో ఈ వీడియోలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ చేసిన సినిమాలు కూడా ఇదే ఫ్రస్టేషన్ తో సాగాయి. అందుకే ఆదర్శ కుటుంబం గ్లింప్స్ చూస్తే అనిల్ రావిపూడి సినిమాలు గుర్తుకువస్తున్నాయి.
దీంతో వెంకీ-త్రివిక్రమ్ క్లాసిక్ కామెడీ టైమింగ్‌తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ వినోదం మేళవించినట్లు అనిపిస్తోందని సోషల్ మీడియా టైమ్లైన్లలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
మొదటి షోతోనే ఆ కామెంట్లకు చెక్!
{{/usCountry}}దీంతో వెంకీ-త్రివిక్రమ్ క్లాసిక్ కామెడీ టైమింగ్‌తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ వినోదం మేళవించినట్లు అనిపిస్తోందని సోషల్ మీడియా టైమ్లైన్లలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
మొదటి షోతోనే ఆ కామెంట్లకు చెక్!
{{/usCountry}}ప్రస్తుతం గ్లింప్స్ పై వస్తున్న పోలికలపై సినీ విశ్లేషకులు స్పందిస్తూ.. "దర్శకుడు త్రివిక్రమ్ శైలి, మేకింగ్ వేరు. అనిల్ రావిపూడి టేకింగ్ వేరు. కేవలం ఒక సీన్ ఆధారంగా దర్శకుడి ముద్రను వేరేవారితో పోల్చడం తొందరపాటే అవుతుంది. మొదటి షో పడితే కానీ త్రివిక్రమ్ రాసిన అసలైన వింటేజ్ డైలాగ్ పవర్ ఏంటో పూర్తిగా అర్థం కాదు" అని స్పష్టం చేస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ ఆదర్శ కుటుంబం చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది.
సంక్రాంతి నుంచి దసరా రేసులోకి ఎందుకు మారింది?
నిజానికి 'ఆదర్శ కుటుంబం' సినిమాను పక్కా సంక్రాంతి (2027) ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పండగ బరిలో దింపాలని నిర్మాతలు భావించారు. అయితే, అదే సంక్రాంతి రేసులో వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ కూడా బరిలో ఉండటంతో, ఒకే హీరో రెండు సినిమాలు ఒకే పండుగకు రావడం కరెక్ట్ కాదని భావించి మేకర్స్ తమ విడుదల తేదీని మార్చుకున్నారు. దీంతో ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.