బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్. ఒకరిపై ఒకరు కురిపించుకునే ప్రేమతో ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచే ఈ జంట గురించి ఇప్పుడు ఒక నెగెటివ్ చర్చ మొదలైంది. ఒక పెళ్లి వేడుకలో విక్కీ కౌశల్ సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను వివాదంలోకి నెట్టాయి.
ఏం మాట్లాడారు? ఎందుకు ఇంత రచ్చ?

ఇటీవల ఒక వివాహ వేడుకకు హాజరైన విక్కీ కౌశల్, అక్కడ పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడుతూ తనదైన శైలిలో 'హౌ ఈజ్ ద జోష్' అంటూ సందడి చేశారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే విమర్శలకు దారితీశాయి.
పెళ్లయిన వారిలో తగ్గిపోతుంది
"నేను గమనించింది ఏంటంటే.. బ్యాచిలర్స్‌లో జోష్ ఎప్పుడూ హైగానే ఉంటుంది. కానీ మా లాంటి పెళ్లయిన వారిలో మాత్రం ఏటా ఆ జోష్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ కంగారు పడకండి.. నాలుగు రోజుల్లోనే ఆ జోష్ ఏమీ తగ్గిపోదు" అని విక్కీ కౌశల్ చమత్కరించారు.
"ఇది 2026.. ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి జోకులేనా?"
విక్కీ కౌశల్ వేసిన పెళ్లి జోకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విక్కీపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా మహిళా నెటిజన్లు విక్కీ కౌశల్ తీరును తప్పుబడుతున్నారు.
ఇలాంటి పిచ్చి జోకులను
"మనం ఇప్పుడు 2026లో ఉన్నాం.. ఇప్పటికీ ఆ పాతకాలపు భార్య-భర్తల జోకులేనా? ఇలాంటి పిచ్చి జోకులను 2016లోనే 'కామెడీ నైట్స్ విత్ కపిల్' షోలోనే వదిలేయాల్సింది" అని ఒక యూజర్ ఘాటుగా స్పందించారు.
పరోక్షంగా భార్యను అవమానించడమే
మరికొందరు స్పందిస్తూ.. "బహిరంగంగా తన వైవాహిక జీవితాన్ని ఎగతాళి చేయడం ఏమాత్రం బాలేదు. ఇది పరోక్షంగా భార్య (కత్రినా కైఫ్)ను అవమానించడమే. వీటిని జోకులుగా తీసుకోలేం.. ఇది మీ ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తుంది" అని అసహనం వ్యక్తం చేశారు. విక్కీ లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదని, ఆయనలో కూడా 'రెడ్ ఫ్లాగ్' (ప్రమాదకర లక్షణాలు) కనిపిస్తున్నాయని కొందరు విమర్శిస్తున్నారు.
విక్కీ - కత్రినాల వివాహ బంధం
{{/usCountry}}మరికొందరు స్పందిస్తూ.. "బహిరంగంగా తన వైవాహిక జీవితాన్ని ఎగతాళి చేయడం ఏమాత్రం బాలేదు. ఇది పరోక్షంగా భార్య (కత్రినా కైఫ్)ను అవమానించడమే. వీటిని జోకులుగా తీసుకోలేం.. ఇది మీ ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తుంది" అని అసహనం వ్యక్తం చేశారు. విక్కీ లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదని, ఆయనలో కూడా 'రెడ్ ఫ్లాగ్' (ప్రమాదకర లక్షణాలు) కనిపిస్తున్నాయని కొందరు విమర్శిస్తున్నారు.
విక్కీ - కత్రినాల వివాహ బంధం
{{/usCountry}}ఇలా ఎప్పుడు పాజిటివిటీ తెచ్చుకునే విక్కీ కౌశల్ తొలిసారి నెగెటివ్ ముద్ర వేసుకున్నాడు. ఇదిలా ఉంటే, ఒక అవార్డు వేడుకలో "ముజ్ సే షాదీ కరోగీ?" (నన్ను పెళ్లి చేసుకుంటావా?) అని కత్రినా కైఫ్‌ను విక్కీ కౌశల్ అడిగిన సరదా ప్రశ్న వారి ప్రేమాయణానికి పునాది వేసింది.
ఉదయ్‌పూర్‌లో వివాహం
2021 డిసెంబర్ 9న ఉదయ్‌పూర్‌లో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతేడాది నవంబర్‌లో ఈ దంపతులకు 'విహాన్ కౌశల్' అనే కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ తల్లిదండ్రులుగా కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో విక్కీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఇమేజ్‌కు కొంత డ్యామేజ్ కలిగిస్తాయేమో చూడాలి.