...
...
Next Story

Vijay Trisha: సీఎం అయ్యాక ఫస్ట్ టైమ్.. త్రిషతో కలిసి కనిపించిన విజయ్.. హగ్ చేసుకుని ఎమోషనల్ అయిన అజిత్.. వీడియోలు వైరల్

Vijay Trisha: తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సీఎం విజయ్, త్రిష జోడీ మళ్లీ కనిపించింది. స్టార్ హీరో అజిత్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు విజయ్, త్రిష కలిసి వెళ్లారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: May 31, 2026, 07:25:17 IST
Advertisement

Vijay Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్, త్రిష జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. సీఎం అయ్యాక త్రిషతో కలిసి విజయ్ కనిపించడం ఇదే తొలిసారి. స్టార్ హీరో అజిత్ తల్లి భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకు విజయ్, త్రిష కలిసి వాళ్ల ఇంటికి వెళ్లారు. వీళ్లిద్దరు ఒకే కార్లో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

విజయ్, త్రిష కలిసి

సీఎం అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కనిపించిన విజయ్, త్రిష
సీఎం అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కనిపించిన విజయ్, త్రిష

దళపతి విజయ్, త్రిషకు సంబంధించిన ప్రతి విషయం గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఈ జంట ఇప్పుడు మరోసారి కలిసి కనిపించడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటికి ఈ జోడీ వెళ్లింది. అజిత్ తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమెకు నివాళి అర్పించడంతో పాటు అజిత్ ను పరామర్శించేందుకు విజయ్, త్రిష వెళ్లారు.

అజిత్ ఎమోషనల్

ఒకే కార్లో విజయ్, త్రిష ప్రయాణించడంతో మరోసారి పుకార్లు గుప్పుమంటున్నాయి. తన తల్లికి నివాళి అర్పించడానికి వచ్చిన సీఎం విజయ్ ను హత్తుకుని అజిత్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత త్రిషతో మాట్లాడాడు. ఈ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

నెగెటివ్ వద్దు

మరోవైపు ఈ వీడియోతో విజయ్, త్రిష రిలేషన్ షిప్ కన్ఫామ్ అయిందని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు. బాధలో ఉన్న అజిత్ కోసం విజయ్, త్రిష కలిసి వెళ్లడంతోనే వీళ్ల బంధంపై ఓ స్పష్టత వచ్చిందనే కామెంట్లు చేస్తున్నారు.

భార్య విడాకులు

సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు విజయ్ నుంచి విడాకులు కోరుతూ అతని భార్య సంగీత సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు ఓ హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. దీంతో ఆ హీరోయిన్ త్రిషనే అనే రూమర్లు వినిపిస్తున్నాయి.

ఇక విజయ్, త్రిష కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు వెళ్లడంతో పుకార్లు మరింత బలపడ్డాయి. ఎన్నికల్లో టీవీకే ప్రభంజనంతో త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి మరీ అభినందించింది. విజయ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలోనూ త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks