విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విరోష్ జోడీ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఢిల్లీలో ప్రధాన మంత్రి మోడీని కలిసేందుకు విరోష్ వెళ్లారు. ప్రధానిని తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఆహ్వానించారు. ఆ తర్వాత హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు.
విమానంలో విరోష్

హైదరాబాద్ కు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విమానంలో వచ్చారు. అయితే వీళ్లు ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడం విశేషం. విరోష్ జోడీని ప్లైట్ లో చూడగనే ప్రయాణికులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వైరల్ వీడియో
ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో రష్మిక, విజయ్ విమానంలో ఉన్నట్లు కనిపించింది. రష్మిక సంతోషంగా నవ్వుతూ విమానంలోని ప్రయాణికులకు హాయ్ చెప్తూ కనిపించింది. ఈ వీడియోలో విజయ్ సిబ్బందితో మాట్లాడుతూ సీటు కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపించాడు. మరోవైపు రష్మిక ఏమో ప్రయాణికులకు నవ్వుతూ అభివాదం చేస్తూ నవ్వుతూ కనిపించింది. ఎకానమీ క్లాస్ లో విజయ్, రష్మిక ప్రయాణించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనే కామెంట్లు వస్తున్నాయి.
నెటిజన్ల రియాక్షన్
ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లో విజయ్, రష్మిక ప్రయాణించడంపై నెటిజన్ల రియాక్షన్ వైరల్ గా మారింది. ‘‘మిస్టర్ & మిసెస్ దేవరకొండ ఇక్కడ ఉన్నారు’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘వాళ్లను చూసి చాలా సంతోషమేసింది’’, ‘‘రష్మిక ఆనందం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది’’, ‘‘వీళ్లు ఎకానమీలో ప్రయాణిస్తారా?’’ అని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
ప్రైవేట్ జర్నీ
{{/usCountry}}ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లో విజయ్, రష్మిక ప్రయాణించడంపై నెటిజన్ల రియాక్షన్ వైరల్ గా మారింది. ‘‘మిస్టర్ & మిసెస్ దేవరకొండ ఇక్కడ ఉన్నారు’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘వాళ్లను చూసి చాలా సంతోషమేసింది’’, ‘‘రష్మిక ఆనందం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది’’, ‘‘వీళ్లు ఎకానమీలో ప్రయాణిస్తారా?’’ అని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
ప్రైవేట్ జర్నీ
{{/usCountry}}‘‘పెళ్లి తర్వాత విజయ్, రష్మిక ఎకానమీలో ట్రావెల్ చేయడం ఏంటీ? వాళ్లు ప్రైవేట్ గా ప్రయాణిస్తారని అనుకున్నా’’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. ‘‘ఇలాంటి రిచ్ పర్సన్స్ కూడా ఇండిగోలో ప్రయాణిస్తారా’’ అని మరొకరు కౌంటర్ వేశాడు. ‘‘రష్మికకు విజయ్ విండో సీట్ ఇచ్చాడు’’ అని ఇంకొకరు రాసుకొచ్చారు.
రిసెప్షన్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు. తెలుగు, కొడవ సంప్రదాయాల్లో విరోష్ వెడ్డింగ్ జరిగింది. మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్మిక ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటో పోస్టు అత్యధిక లైక్స్ సాధించిన పోస్టుగా రికార్డు ఖాతాలో వేసుకుంది.