...
...
Next Story

Virosh Record: విరోష్ క్రేజ్ మామూలుగా లేదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల‌కు లైక్‌ల వ‌ర్షం.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్‌

Virosh Record: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదు. విరోష్ వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ ల వర్షం కురిపిస్తున్నాయి. దెబ్బకు విరాట్ కోహ్లి అత్యధిక లైైక్ ల రికార్డు బద్దలైంది.

Published on: Feb 28, 2026, 15:11:22 IST
Advertisement

జాతీయ స్థాయిలో విరోష్ వెడ్డింగ్ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది. విరోష్ జంట తమ పెళ్లి ఫొటోలను వెంటనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. భారత్ నుంచి అత్యధిక లైక్స్ సాధించిన ఫొటోలుగా హిస్టరీ క్రియేట్ చేశాయి.

విరోష్ ఫొటోలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

విరోష్ వెడ్డింగ్ ఫొటోలపై లైక్ ల వర్షం కురుస్తోంది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండపై సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు లైక్స్ లతో తమ ప్రేమను కురిపిస్తున్నారు. రష్మిక మందన్న తన ఇన్ స్టాగ్రామ్ లో వెడ్డింగ్ ఫొటోలతో పోస్టు పెట్టింది. ఈ పోస్టుకు ఇప్పటివరకూ 24 మిలియన్ (2 కోట్ల 40 లక్షలు) కు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ కోహ్లి రికార్డును విరోష్ జోడీ బ్రేక్ చేసినట్లు అయింది.

విరాట్ కోహ్లి రికార్డు

నిన్నటి వరకూ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ పొందిన ఫొటో పోస్టు రికార్డు విరాట్ కోహ్లి పేరు మీద ఉండేది. 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లి పెట్టిన పోస్టుకు 22.8 మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పుడు 24 మిలియన్ ప్లస్ లైక్స్ తో రష్మిక మందన్న పోస్టు విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ సాధించిన ఇండియన్ ఫొటో పోస్టుగా ఇది నిలిచింది.

విజయ్ పోస్టు

ఓవరాల్ గా రీల్స్, వీడియో, ఫొటోలు ఇలా కలిపి చూసుకుంటే ఇన్ స్టాగ్రామ్ లో రెండో అత్యధిక లైక్స్ పొందిన పోస్టుగా రష్మిక మందన్న పోస్టు నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో కంటెంట్ క్రియేటర్ కిశోర్ మోండల్ పోస్ట్ చేసిన రీల్ ఉంది. 'జీనే లగా హూ' పాటను కిశోర్ పాడుతున్న ఆ వీడియో 51 మిలియన్ లైకులతో దూసుకెళ్తోంది.

ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్న విరోష్ జోడీ మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనుంది. దీనికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks