...
...
Next Story

Vijay Devarakonda: సెలబ్రేషన్స్ అయిపోయాయి.. ఇక అండర్ గ్రౌండ్ వెళ్లిపోతామన్న విజయ్ దేవరకొండ.. రష్మిక క్యూట్ రియాక్షన్

Vijay Devarakonda: విరోష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాయి. పెళ్లి, ఆ తర్వాత సొంత ఊర్లో విందు, ఫ్యాన్స్ కు ట్రీట్, చివరగా రిసెప్షన్.. ఇలా సుమారు 10 రోజులుగా విజయ్, రష్మిక బిజీగా గడిపారు. దీంతో అలసిపోయిన విజయ్ ఇక అండర్ గ్రౌండ్ వెళ్లిపోతామని పేర్కొన్నాడు. దీనికి రష్మిక రియాక్షన్ వైరల్ గా మారింది.

Published on: Mar 5, 2026, 05:52:54 IST
Advertisement

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి ముగిసింది. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకతో తమ పెళ్లి ఈవెంట్లను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కంప్లీట్ చేసుకున్నారు. దీంతో ఇక అండర్ గ్రౌండ్ వెళ్లిపోతామని విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

గ్రాండ్ గా రిసెప్షన్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (x/filmfare)
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (x/filmfare)

విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, కేటీఆర్, కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ రిసెప్షన్ కు వచ్చారు. బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో ఈ వేడుక జరిగింది.

విజయ్ కామెంట్లు

తమ వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. రిసెప్షన్ చివర్లో అందరికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న థ్యాంక్స్ చెప్పారు. ‘‘అందరికీ థ్యాంక్స్. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ రోజు మేం సెలబ్రేషన్స్ ముగించాం. ఇక ఎలాంటి సందడి లేకుండా అండర్ గ్రౌండ్ వెళ్లిపోతాం’’ అని విజయ్ దేవరకొండ అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న రష్మిక క్యూట్ గా నవ్వేసింది.

విరోష్ వెడ్డింగ్ బిజీ

తన సొంత ఊరు గ్రామస్థులకు విజయ్ దేవరకొండ విందు భోజనం పెట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించారు. చివరగా మార్చి 4న వెడ్డింగ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

హనీమూన్?

పెళ్లి సందడి ముగించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇక హనీమూన్ కు వెళ్లబోతున్నారని తెలిసింది. మరి వీళ్లు ఎక్కడికి వెళ్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే ఈ జంట ఒకసారి మాల్దీవ్స్ వెళ్లింది. మరి ఇప్పుడు భార్యాభర్తలుగా మళ్లీ మాల్దీవ్స్ కే వెళ్తారా? లేదా ఇంకేమైనా ప్లాన్ చేశారా? అన్నది వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks