...
...
Next Story

Vijay Deverakonda: తెలంగాణ విద్యార్థులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్.. అదే నా కల అంటూ సంచలన ప్రకటన.. నెటిజన్లు ఫిదా

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ అనౌన్స్ మెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్టూడెంట్లకు విజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Published on: Jun 14, 2026, 14:25:28 IST
Advertisement

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కేవలం స్క్రీన్‌పైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తన మార్క్ చాటుకునేందుకు ఒక భారీ సోషల్ ఇనిషియేటివ్‌ను అనౌన్స్ చేశాడు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన టాపర్స్ కు స్కాలర్‌షిప్‌లు అందిస్తానని ప్రకటించాడు.

విజయ్ దేవరకొండ సంచలనం

తెలంగాణ విద్యార్థులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్.. అదే నా కల అంటూ సంచలన ప్రకటన (x)
తెలంగాణ విద్యార్థులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్.. అదే నా కల అంటూ సంచలన ప్రకటన (x)

తన సొంత మండలం అచ్చంపేటలోని ప్రభుత్వ పాఠశాల్లలో 9,10 వ తరగతి క్లాస్ ల్లో ఇద్దరు టాపర్ల చొప్పున 180 మందికి విజయ్ దేవరకొండ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ తరపున ఈ స్టూడెంట్స్ కు ఇవాళ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి స్కాలర్ షిప్ లు అందించారు. ఈ ఈవెంట్ సందర్భంగా విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన చేశాడు.

తెలంగాణ వ్యాప్తంగా

ఆదివారం (జూన్ 14) తన సొంతూరు తుమ్మన్‌పేటలో అచ్చంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల టాపర్లకు స్కాలర్ షిప్ లు అందించాడు. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడాడు.

‘‘ఇప్పుడు అచ్చంపేట మండంలోని విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించాం. తర్వాత నాగర్ కర్నూల్ మండలం కూడా వెళ్తాం. ఇలా క్రమంగా తెలంగాణ వ్యాప్తంగా టాపర్లకు చేరాలన్నదే మా కల. మీ జీవితాల్లో నేను భాగం కావాలని కోరుకుంటున్నా’’ అని విజయ్ దేవరకొండ ప్రకటించాడు.

నెటిజన్లు ఫిదా

విజయ్ దేవరకొండ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ రౌడీ హీరో స్కాలర్ షిప్ లు ఇస్తానని అనౌన్స్ చేయడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విజయ్ దేవరకొండను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

కరోనా టైమ్ లో

విజయ్ దేవరకొండ తన ‘ది దేవరకొండ ఫౌండేషన్’ పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. రష్మిక మందన్నను ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సొంత ఊర్లో వ్రతం నిర్వహించి, గ్రామస్థులకు భోజనాలు పెట్టాడు. ఆ సమయంలోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తానని ప్రకటించాడు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.

భార్యతో కలిసి

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో తన భార్య రష్మిక మందన్నతో కలిసి విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 11, 2026న రిలీజ్ కానుంది. మరోవైపు విజయ్ ‘రౌడీ జనార్ధన్’ మూవీ కూడా చేస్తున్నాడు.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

​ప్రశ్న: విజయ్ దేవరకొండ విద్యార్థుల కోసం ఏం ప్రకటించాడు?

జవాబు: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు రాబోయే రోజుల్లో తమ ఫౌండేషన్ ద్వారా స్కాలర్‌షిప్‌లు అందిస్తామని విజయ్ దేవరకొండ ప్రకటించాడు.

​ప్రశ్న: ఈ స్కాలర్‌షిప్‌లు ఎవరికి అందుతాయి?

జవాబు: తెలంగాణలోని టాప్ స్టూడెంట్స్, చదువులో మంచి ప్రతిభ కనబరిచే టాపర్లకు ఈ విద్యా వేతనాలు అందుతాయని హీరో పేర్కొన్నాడు.

​ప్రశ్న: ఈ నిర్ణయంపై విజయ్ దేవరకొండ ఏమన్నాడు?

జవాబు: రాష్ట్రంలోని విద్యార్థులకు ఇలా ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా సహాయం అందించడం తన జీవిత కాల కల (డ్రీమ్) అని విజయ్ స్పష్టం చేశాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe