...
...
Next Story

కోడలికి అదొక్కటే కండిషన్ పెట్టిన విజయ్ దేవరకొండ పేరెంట్స్.. ఐ లవ్యూ రష్మిక అంటూ.. మాధవి ఆంటీ నా రెండో తల్లి అన్న రష్మిక

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎట్టకేలకు తమ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు పాత ఫోటోలు, వీడియోలను బయటకు తీస్తూ, వీరికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Published on: Feb 23, 2026, 19:02:29 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక, విజయ్ పెళ్లి ఈ గురువారమే అంటే ఫిబ్రవరి 26న జరగబోతోంది. ఈ నేపథ్యంలో వీళ్ల లవ్ స్టోరీ జర్నీ, విజయ్ పేరెంట్స్ తమ కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయ్ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి.. తమ డ్రీమ్ కోడలు ఎలా ఉండాలో చెబుతూ మాట్లాడిన ఒక పాత వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

కోడలికి విజయ్ తల్లిదండ్రుల కండిషన్ ఏంటంటే..

కోడలికి అదొక్కటే కండిషన్ పెట్టిన విజయ్ దేవరకొండ పేరెంట్స్.. ఐ లవ్యూ రష్మిక అంటూ.. మాధవి ఆంటీ నా రెండో తల్లి అన్న రష్మిక
కోడలికి అదొక్కటే కండిషన్ పెట్టిన విజయ్ దేవరకొండ పేరెంట్స్.. ఐ లవ్యూ రష్మిక అంటూ.. మాధవి ఆంటీ నా రెండో తల్లి అన్న రష్మిక

2018లో జరిగిన 'గీత గోవిందం' సక్సెస్ మీట్‌లో యాంకర్ సుమ.. విజయ్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ అతని పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. మీకు ఎలాంటి కోడలు రావాలని మీరు కలలు కంటున్నారని మాధవిని సుమ అడిగినప్పుడు.. ఆమె తనకు ఒకే ఒక కండిషన్ ఉందని బదులిచ్చారు.

"మా బాబుని మంచిగా చూసుకునే కోడలు వస్తే చాలు. ఆమె అతన్ని బేషరతుగా ప్రేమించాలి అంతే. అతను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, ఆమె అతన్ని బాగా అర్థం చేసుకోవాలి" అని మాధవి చెప్పుకొచ్చారు.

అదే సమయంలో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా తన భార్య అభిప్రాయంతో ఏకీభవిస్తూ.. "తనకు నచ్చిన అమ్మాయినే అతను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఎలాంటి అభ్యంతరాలు, అంచనాలు లేవు. అలాగే నాకు కులం, మతం గురించి కూడా ఎలాంటి పట్టింపులు లేవు. అతను ఒక భారతీయురాలిని, ముఖ్యంగా ఒక సౌత్ ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

లవ్ మ్యారేజే చేసుకుంటానన్న విజయ్

మరోవైపు విజయ్ కూడా గతంలో ఒక ఈవెంట్‌లో తనకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదని స్పష్టం చేశాడు. "నేను చేసుకుంటే కేవలం లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి నా తల్లిదండ్రులకు కూడా నచ్చాలి" అని పేర్కొన్నాడు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లిని ఎట్టకేలకు కన్ఫమ్ చేశారు. గతేడాది అక్టోబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీళ్ల పెళ్లి ఫిబ్రవరి 26నే అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నా.. ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అయితే ఫైనల్‌గా ఆదివారం (ఫిబ్రవరి 22) నాడు ఈ ఇద్దరు మౌనం వీడి తమ సోషల్ మీడియా ద్వారా పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు.

"మేము మా కోసం ఎలాంటి ప్లాన్స్ చేసుకోకముందే, ఏదీ ఎంచుకోకముందే.. మీరు ఉన్నారు. ఎంతో ప్రేమతో మీరే మాకు ఒక పేరు పెట్టారు. మమ్మల్ని "విరోష్" (VIROSH) అని పిలిచారు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా, మా కలయికకు మీ గౌరవార్థం ఆ పేరే పెడుతున్నాము. మా పెళ్ళికి "ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" అని పేరు పెట్టాలనుకుంటున్నాము. మమ్మల్ని ఇంతలా ప్రేమించినందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ మాలో ఒక భాగమే. బిగ్గెస్ట్ హగ్స్ అండ్ ఫుల్ లవ్!" అని అన్నారు.

ఇక సోమవారం (ఫిబ్రవరి 23) విజయ్, రష్మిక తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఉదయ్‌పూర్ వెళ్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. మంగళవారం నుంచి వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe