టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. ముఖ్యంగా 2025 అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగిందన్న ఊహాగానాలు వచ్చినప్పటి నుంచి వీరిద్దరూ ఎప్పుడు ఒక్కటవుతారా అని అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.
రాజస్థాన్ ప్యాలెస్‌లో పెళ్లి పనులు?

రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో భారీ స్థాయిలో అలంకరణలు జరుగుతున్న దృశ్యాలు ఒక వీడియో రూపంలో బయటకు వచ్చాయి. ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ప్యాలెస్‌లోని అలంకరణలను (డెకరేషన్స్) చూపిస్తూ, "ఫిబ్రవరి 2న విజయ్, రష్మికల వివాహం ఇక్కడే జరగబోతోంది" అని చెప్పడం విశేషం. ప్యాలెస్‌లో ఏర్పాటు చేస్తున్న భారీ వేదికలు, పూల అలంకరణలు, షాండ్లియర్లు (ఝుమర్లు) చూస్తుంటే అక్కడ ఏదో పెద్ద వేడుక జరగబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
రహస్య నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో రష్మిక, విజయ్ ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఈ జంట ఫిబ్రవరి 2026లో వివాహం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి.
పెళ్లిని చాలా వ్యక్తిగతంగా, కేవలం అత్యంత సన్నిహితుల మధ్యే జరపాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఉదయ్‌పూర్‌లోని ఒక హెరిటేజ్ ప్రాపర్టీని ఈ వేడుక కోసం ఖరారు చేసినట్లు టాక్. ఇక ఇప్పుడు రేపే (ఫిబ్రవరి 2) విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్త హల్‌చల్ అవుతోంది.
'గీత గోవిందం' నుంచి మొదలైన ప్రయాణం
2018లో విడుదలైన 'గీత గోవిందం', ఆ తర్వాత వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో విజయ్-రష్మికల కెమిస్ట్రీ చూసి వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు అప్పట్లోనే మొదలయ్యాయి.
{{/usCountry}}2018లో విడుదలైన 'గీత గోవిందం', ఆ తర్వాత వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో విజయ్-రష్మికల కెమిస్ట్రీ చూసి వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు అప్పట్లోనే మొదలయ్యాయి.
{{/usCountry}}ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి రష్మికను ప్రశ్నించగా.. "గత నాలుగేళ్లుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. అందరూ ఆ వార్త కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు" అంటూ సమాధానం దాటవేశారు. అయితే, రష్మిక, విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
వైరల్ వీడియోపై సన్నిహిత వర్గాలు
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వైరల్ వీడియోపై రష్మిక మందన్నా సన్నిహిత వర్గాలు స్పందిస్తూ అవి కేవలం వదంతులేనని చెబుతున్నాయి. ఏది ఏమైనా, వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ జంట నిజంగానే పెళ్లి పీటలు ఎక్కుతున్నారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!