...
...
Next Story

అప్పుడు రష్మిక మెడలో మూడు ముళ్లు వేయడానికి చాలా భయపడ్డాను.. అది ఆమెకు మూడోసారి కావడంతో కూల్‌గానే ఉంది: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Vijay Deverakonda Rashmika mandanna) పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఒకప్పుడు గీత గోవిందం మూవీ షూటింగ్ లో ఇదే రష్మిక మెడలో మూడు ముళ్లు వేయడానికి తాను ఎంతగా ఇబ్బంది పడ్డానో అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో విజయ్ వెల్లడించాడు.

Published on: Feb 26, 2026, 21:01:42 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎట్టకేలకు పెళ్లితో ఒకటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. అయితే ఏడేళ్ల కిందటే గీత గోవిందం షూటింగ్ సందర్భంగా తొలిసారి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయడానికి విజయ్ భయపడ్డాడన్న విషయం తెలుసా?

ఏడేళ్ల క్రితమే పడిన ‘ముడి’

అప్పుడు రష్మిక మెడలో మూడు ముళ్లు వేయడానికి చాలా భయపడ్డాను.. అది ఆమెకు మూడోసారి కావడంతో కూల్‌గానే ఉంది: విజయ్ దేవరకొండ
అప్పుడు రష్మిక మెడలో మూడు ముళ్లు వేయడానికి చాలా భయపడ్డాను.. అది ఆమెకు మూడోసారి కావడంతో కూల్‌గానే ఉంది: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ముచ్చట వినగానే అభిమానులకు ఏడేళ్ల క్రితం నాటి 'గీత గోవిందం' సినిమా గుర్తుకు వస్తోంది. అయితే అప్పట్లో ఒక సీన్ కోసం రష్మికకు తాళి కట్టాల్సి వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ తెగ భయపడిపోయాడట. 2018లో సినిమా ప్రమోషన్ల సమయంలో ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

"పెళ్లి మంటపంలో కూర్చోవడం వరకు అంతా బాగానే ఉంది కానీ, రష్మికకు ఆ మూడు ముళ్లు వేయాల్సి వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. అది కేవలం షూటింగ్ అని నాకు తెలుసు. కానీ రష్మిక పట్టుచీరలో ఉంది, నేను పట్టు పంచె కట్టుకున్నాను. చుట్టూ పూలు, మంటపం.. అంతా రియల్ పెళ్లిలాగే ఉంది. అప్పుడు రష్మికతో అన్నాను.. 'ఏంటో ఇది చాలా వింతగా ఉంది' అని. అప్పటికే ఆమెకు సినిమాల్లో అది మూడో పెళ్లి కావడంతో తను పెద్దగా టెన్షన్ పడలేదు కానీ, నేను మాత్రం షేక్ అయిపోయాను" అని అప్పట్లో విజయ్ సరదాగా చెప్పుకొచ్చాడు.

నిజ జీవితంలో 'శ్రీమతి'గా రష్మిక..

విజయ్ స్పందిస్తూ.. "నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నా భార్య అయింది. తను పక్కన లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుందని నాకు అర్థమైంది. భోజనం చేస్తున్నా, వర్కవుట్ చేస్తున్నా తను తోడుంటేనే ఆ కిక్కు వేరు. ఎక్కడున్నా సరే నా ఇల్లు, నా ప్రశాంతత రష్మికే" అంటూ తన ప్రేమను చాటుకున్నాడు.

ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి దర్శకుడు తరుణ్ భాస్కర్, నటులు రాహుల్ రవీంద్రన్, ఈషా రెబ్బా, కల్యాణి ప్రియదర్శన్, ఆషికా రంగనాథ్, శ్రావ్య వర్మ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks