Vijay Deverakonda: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కు సిద్ధమయ్యాడు. 'హాయ్ నాన్న' చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ప్రస్తుతానికి 'VDxShouryuv' అనే వర్కింగ్ టైటిల్‌తో శనివారం (ఏప్రిల్ 18) పోస్టర్ పోస్టు చేశాడు.
విజయ్ దేవరకొండ కొత్త సినిమా

విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో అతను షేర్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కుక్కలను పట్టుకుని విజయ్ ముందు నడవగా.. ఆయుధాలు, గుర్రంతో అతని టీమ్ వెనకాలే వస్తుంది. శౌర్యువ్ గుర్రాన్ని పట్టుకున్నాడు.
అదిరే టీమ్
ఈ సినిమా గురించి విజయ్ రాసుకొచ్చిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "ఈ భయానకమైన సినిమాను రూపొందించే కష్టతరమైన బాధ్యతను తీసుకుంటున్న టీమ్‌ను పరిచయం చేస్తున్నా. శౌర్యువ్ అద్భుతమైన ఊహాశక్తికి, భావోద్వేగాలకు ప్రాణం పోయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు జతకట్టడం సంతోషంగా ఉంది. నా స్నేహితులారా.. మీరు గర్జించండి, ఈ సినిమా కోసం నా సర్వస్వాన్ని ధారపోస్తాను" అంటూ విజయ్ తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు.
ఈ కోపమంతా
విజయ్ దేవరకొండ షేర్ చేసిన పోస్టర్ పై ‘ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమనే’ అనే క్యాప్షన్ ఉంది. అంటే ఇది ప్రేమలో విఫలమైన ఓ యువకుడి కథ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కేవలం టాలీవుడ్ స్థాయిలోనే కాకుండా, గ్లోబల్ స్కేల్లో ఉండబోతోందని చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది.
{{/usCountry}}విజయ్ దేవరకొండ షేర్ చేసిన పోస్టర్ పై ‘ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమనే’ అనే క్యాప్షన్ ఉంది. అంటే ఇది ప్రేమలో విఫలమైన ఓ యువకుడి కథ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కేవలం టాలీవుడ్ స్థాయిలోనే కాకుండా, గ్లోబల్ స్కేల్లో ఉండబోతోందని చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది.
{{/usCountry}}ముఖ్యంగా హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' (House of the Dragon) సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్ ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. వీరితో పాటు 'బ్యాట్‌మెన్ ఫరెవర్', 'స్నోపియర్సర్' వంటి భారీ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ (VFX) బృందం ఈ సినిమా కోసం రంగంలోకి దిగింది. ఎమ్మీ అవార్డు గ్రహీత, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డర్స్ట్ కూడా ఈ టీమ్‌లో భాగమయ్యాడు.
హేషమ్ మ్యూజిక్
రీసెంట్ టైమ్స్ లో అదిరిపోయే మ్యూజిక్, సాంగ్స్ తో పాపులర్ అయిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. విజయ్, సమంత జంటగా నటించిన ‘ఖుషీ’ మూవీకి హేషమ్ మ్యూజిక్ అందించాడు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్‌గా, సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సచిన్ లోవలేకర్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నాడు.
కొత్త మలుపు
'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో యూత్ ఐకాన్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ, ఇప్పుడు వైవిధ్యమైన భారీ ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తున్నారు. డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు శౌర్యువ్ తో విజయ్ చేతులు కలపడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ 'రణబాలి' అనే చరిత్రాత్మక యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇందులో అతని భార్య రష్మిక మందన్న హీరోయిన్. మరోవైపు రౌడీ జనార్ధన్ కూడా అతని లైనప్ లో ఉంది.