...
...
Next Story

Vijay Rashmika: చిన్నపిల్లోడిలా మారిపోయిన విజయ్ దేవరకొండ.. అమ్మానాన్న మధ్యలో పడుకొని.. ఫొటో తీసిన రష్మిక కామెంట్ వైరల్

Vijay Rashmika: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చిన్నపిల్లాడిలా మారిపోయాడు. వర్షాల కారణంగా షూటింగ్ క్యాన్సిల్ కావడంతో అమ్మానాన్న మధ్యలో పడుకొని హాయిగా నిద్రపోయాడు. ఈ ఫొటోను రష్మిక మందన్న క్లిక్ మనిపించింది. అంతేకాకుండా ఈ ఫొటోకు రష్మిక పెట్టిన కామెంట్ వైరల్ గా మారింది.

Published on: Aug 20, 2026, 09:24:20 IST
Advertisement

Vijay Rashmika: సినిమాల్లో రష్ అండ్ బోల్డ్ లుక్ తో రౌడీ బాయ్ లా దూసుకెళ్లే విజయ్ దేవరకొండ ఒక్కసారిగా చిన్న పిల్లోడిలా మారిపోయాడు. సినిమాల్లో ఎలా ఉన్నా బయట మాత్రం తన ఫ్యామిలీతో విజయ్ దేవరకొండకు మంచి అనుబంధం ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఫొటోతో అది మరోసారి రుజువైంది.

విజయ్ దేవరకొండ ఫొటో

చిన్నపిల్లోడిలా మారిపోయిన విజయ్ దేవరకొండ.. అమ్మానాన్న మధ్యలో పడుకొని.. ఫొటో తీసిన రష్మిక కామెంట్ వైరల్ (instagram-Vijay Deverakonda)
చిన్నపిల్లోడిలా మారిపోయిన విజయ్ దేవరకొండ.. అమ్మానాన్న మధ్యలో పడుకొని.. ఫొటో తీసిన రష్మిక కామెంట్ వైరల్ (instagram-Vijay Deverakonda)

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బుధవారం (ఆగస్టు 19) రాత్రి తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో పోస్టు చేశాడు. అందులో అటు వైపు నాన్న, ఇటు వైపు అమ్మ నిద్ర పోతుండగా విజయ్ దేవరకొండ మధ్యలో పడుకొని ఉన్నాడు. అమ్మ చేయి పట్టుకొని విజయ్ నిద్రపోతున్నాడు. ఈ పిక్ చూడటానికి చాలా బాగుంది. వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్మిక మందన్నకు క్రెడిట్

‘‘వర్షాల వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయింది. అందుకే చిన్న పిల్లాడిలా మధ్యాహ్నం నిద్రపోయేందుకు ఫేవరెట్ స్పాట్ దొరికింది. 1000 శాతం రికవరీ’’ అని ఈ ఫొటోకు విజయ్ దేవరకొండ క్యాప్షన్ రాశాడు. అంతేకాకుండా పిక్ క్రెడిట్ ను తన భార్య రష్మిక మందన్నకు ఇచ్చాడు. అయితే ఈ ఫొటోకు రష్మిక మందన్న చేసిన కామెంట్ మరింత వైరల్ అవుతోంది.

నా కళ్లు చూడొద్దనా?

2026 ఫిబ్రవరిలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఇప్పుడు రణబాలి సినిమాలో కలిసి నటిస్తోంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విరోష్ జోడీ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్ వాయిదా పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.

రష్మికకు గాయం

మరోవైపు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్. ఇక రష్మిక ఏమో బాలీవుడ్, టాలీవుడ్ లో బిజీ అయిపోయింది. రీసెంట్ గా కాక్టెయిల్ 2 సినిమాతో ఎంటర్ టైన్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ ‘మైసా’లో నటిస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ లో రష్మికకు హిప్ టెండాన్ గాయమైంది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe