Vijay Deverakonda: 6 క్యారవాన్లు, 50 మంది అసిస్టెంట్లు- విజయ్ దేవరకొండ డిమాండ్, స్క్రీన్‌షాట్ వైరల్- అసలు నిజం ఏంటంటే?
Vijay Deverakonda Team On 6 Caravans Demands: హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘రణబాలి’ షూటింగ్‌లో విపరీతమైన డిమాండ్లు పెట్టారంటూ సోషల్ మీడియాలో వస్తున్న స్క్రీన్‌షాట్ వార్తలపై ఆయన బృందం తీవ్రంగా స్పందించింది. 6 క్యారవాన్లు, 50 మంది అసిస్టెంట్లను విజయ్ డిమాండ్ చేశాడన్న వార్తలపై ఇదిగో క్లారిటీ!.
Vijay Deverakonda Team On 6 Caravans Demands: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలపై పుకార్లు రావడం, వాటిపై వారు వివరణ ఇచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే, కొన్నిసార్లు ఈ ప్రచారం హద్దులు దాటి సదరు హీరోల ప్రతిష్టను దెబ్బతీసే స్థాయికి చేరుతోంది.

విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ
తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ నెట్టింట ఒక ఫేక్ స్క్రీన్‌షాట్ హల్‌చల్ చేసింది. ఆయన తన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌ను వేధిస్తున్నారంటూ సృష్టించిన ఈ తప్పుడు వార్త టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ అధికారికంగా స్పందిస్తూ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.
అసలు ఆ ఫేక్ వార్తలో ఏముంది?
ప్రముఖ సినీ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం తరహాలోనే ఒక నకిలీ స్క్రీన్‌షాట్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు. "రణబాలి సెట్స్‌లో హీరో కోసం 5-6 క్యారవాన్లు, 40-50 మంది అసిస్టెంట్లు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్" అనే టైటిల్‌తో ఆ ఫేక్ ఫొటోను వైరల్ చేశారు.
విజయ్ దేవరకొండ అన్యాయమైన డిమాండ్లు పెడుతుండటంతో విసిగిపోయిన నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారంటూ కొందరు ట్రోలర్స్ దీన్ని తెగ షేర్ చేశారు. ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ కావడంతో విజయ్ దేవరకొండ బృందం వెంటనే అప్రమత్తమైంది. జూన్ 25న ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఈ పుకార్లకు చెక్ పెట్టింది.
తప్పుడు ప్రచారంపై విజయ్ టీమ్ సీరియస్
"విజయ్ దేవరకొండ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొందరు వ్యక్తులు పనిగట్టుకుని ఈ తప్పుడు ప్రచారాన్ని సృష్టించారు. న్యూస్ పోర్టల్స్, యాప్స్‌లో వచ్చిన వార్తలా కనిపించేలా ఫేక్ స్క్రీన్‌షాట్లను సృష్టించి వైరల్ చేస్తున్నారు" విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ తెలిపింది.
"విజయ్ దేవరకొండ రణబాలి సినిమా కోసం 5-6 క్యారవాన్లు అడిగారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇవన్నీ పూర్తిగా బేస్‌లెస్ వార్తలు. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దు, షేర్ చేయవద్దు" అని విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ స్పష్టం చేసింది.
మరోవైపు తమ వెబ్‌సైట్ పేరును వాడుకుని తప్పుడు వార్తలు సృష్టించిన వారిపై సదరు సినీ పోర్టల్ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇలాంటి వార్తను ఎప్పుడూ రాయలేదని, తమ బ్రాండ్ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వరుస ప్రాజెక్టులతో బిజీగా రౌడీ హీరో
గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు దక్కడం లేదు. 2024లో వచ్చిన ‘ది ఫ్యామిలీ స్టార్’, 2025లో విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, ‘కల్కి 2898 ఏడీ’తో పాటు ఈ ఏడాది వచ్చిన ‘సింగ్ గీతం’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసి అలరించారు.
ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా ‘రౌడీ జనార్ధన’ అనే చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. దీనితో పాటు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘రణబాలి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత రష్మికతో తొలి చిత్రం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఈ ఏడాది (2026) ఫిబ్రవరిలో అత్యంత ఆప్తుల మధ్య ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ క్రేజీ కపుల్ స్క్రీన్‌పై కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’ కావడం విశేషం.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ (2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి, అది కూడా నిజజీవిత భాగస్వాములుగా మారాక వస్తున్న సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


