Vinayaka Chavithi Tv Shows: పండగ వచ్చిందంటే టీవీ ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ కిక్కే కిక్కు. ఇక వినాయక చవితి పండగ అంటే ఎంటర్ టైన్మెంట్ వేరే లెవల్ లో ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో టీవీ ఆడియన్స్ ను అలరించేందుకు ఛానెల్స్ రెడీ అయ్యాయి.
ఈటీవీ షో ఇలా

టీవీ ఈవెంట్స్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఛానెల్ ఈటీవీ. ఈ వినాయక చవితికి కూడా అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా గ్రాండ్ షోను ప్లాన్ చేసింది. ‘గల్లీ క గణేష్’ పేరుతో స్పెషల్ ఈవెంట్ ను టెలికాస్ట్ చేయనుంది. ఉదయం 9 గంటలకే ఈ షో స్టార్ట్ కానుంది. మార్నింగ్ టైమ్ లోనే ఎంటర్ టైన్మెంట్ పండగను షురూ చేయనుంది.
ఎపిక్ జోడీ
నందు హోస్ట్ గా ఈ గల్లీ క గణేష్ షో సాగనుంది. హైపర్ ఆది, రోహిత్ సహా జబర్దస్త్ బ్యాచ్ పంచ్ లతో ఈ షో సందడిగా సాగనుంది. ఎపిక్ మూవీతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీగా వచ్చి ఆడియన్స్ ను అలరించనున్నారు. ఇక డ్యాన్స్ లు, స్కిట్లతో పండగ సందడి మరింత పెరగనుంది.
గణపతి బప్పా మోరియా
ఇక పాపులర్ టీవీ ఛానెల్ స్టార్ మా ఏమో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ టీవీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ వినాయక చవితి స్పెషల్ షో మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇందులో స్టార్ మా పాపులర్ సీరియల్ నటీనటులు సందడి చేయనున్నారు. ఇక స్టార్ మా ఆస్థాన యాంకర్ శ్రీముఖి మరోసారి తన ఎనర్జీతో మెస్మరైజ్ చేయనుంది.
ఇక కమెడియన్లు యాదమ్మ రాజు, అవినాష్, ఇమ్మాన్యుయేల్, ఎక్స్ ప్రెస్ హరి కామెడీ కూడా ఆడియన్స్ ను నవ్వించనుంది. ఇందులో సీరియల్ హీరోలు, హీరోయిన్స్, విలన్స్, కమెడియన్స్ మధ్య పోరు జరగనుంది.
ఫుల్ ఎంటర్ టైన్మెంట్
{{/usCountry}}ఇక కమెడియన్లు యాదమ్మ రాజు, అవినాష్, ఇమ్మాన్యుయేల్, ఎక్స్ ప్రెస్ హరి కామెడీ కూడా ఆడియన్స్ ను నవ్వించనుంది. ఇందులో సీరియల్ హీరోలు, హీరోయిన్స్, విలన్స్, కమెడియన్స్ మధ్య పోరు జరగనుంది.
ఫుల్ ఎంటర్ టైన్మెంట్
{{/usCountry}}పండగ సందడిని డబుల్ చేసేందుకు టీవీ ఛానెల్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ లు, ప్రమోషనల్ కంటెంట్ తో రెడీ అయ్యాయి. ముఖ్యంగా టాప్ ఛానెల్స్ ఈటీవీ విన్, స్టార్ మా తమ ఆడియన్స్ ను ప్రతి పండగకు ఎంటర్ టైన్ చేస్తుంటూనే ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి 2026 సందర్భంగా కూడా కామెడీ, ఎమోషన్స్ తో ప్రజలను ఆకట్టుకునేందుకు వచ్చేస్తున్నాయి.
మరి ఇంకెందుకు లేటు.. పండగ రోజు ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఇంట్లో కూర్చుని టీవీ ప్రోగ్రామ్స్ ను ఎంజాయ్ చేసేయండి. ఫ్యామిలీతో కలిసి పండగను ఆస్వాదించేయండి.