...
...
Next Story

Virat Kohli Liz Laz: అప్పుడు అవనీత్ కౌర్, ఇప్పుడు లిజ్ లాజ్.. విరాట్ కోహ్లి లైక్ చేసిన ఈ జర్మన్ మోడల్ ఎవరో తెలుసా?

Virat Kohli Liz Laz: ఇండియన్ టీమ్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తాజాగా జర్మన్ మోడల్ లిజ్ లాజ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో లైక్ చేశాడు. ఆ మధ్య అవనీత్ కౌర్ ఫొటోలను ఇలాగే లైక్ చేయడం, ఆ తర్వాత అల్గారిథమ్ పొరపాటు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మీమ్స్ పేలుతున్నాయి.

Published on: Apr 17, 2026, 14:54:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Virat Kohli Liz Laz: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసే ప్రతి పని ఒక సెన్సేషన్. తాజాగా అతడు ఒక జర్మన్ మోడల్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ చేయడంతో నెటిజన్లు మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. గతంలో అవనీత్ కౌర్ విషయంలో జరిగిన ‘అల్గారిథమ్’ గ్లిచ్‌ను గుర్తుచేస్తూ కోహ్లీని నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు.

గోల్డెన్ అవర్ షాట్స్.. కోహ్లీ డబుల్ టాప్

Virat Kohli Liz Laz: అప్పుడు అవనీత్ కౌర్, ఇప్పుడు లిజ్ లజ్.. విరాట్ కోహ్లి లైక్ చేసిన ఈ జర్మన్ మోడల్ ఎవరో తెలుసా? (Instagram/ ANI)
Virat Kohli Liz Laz: అప్పుడు అవనీత్ కౌర్, ఇప్పుడు లిజ్ లజ్.. విరాట్ కోహ్లి లైక్ చేసిన ఈ జర్మన్ మోడల్ ఎవరో తెలుసా? (Instagram/ ANI)

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అద్వైత్ వైద్య ఇటీవల జర్మన్ మోడల్ లిజ్ లాజ్ (Liz Laz) కి సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లైట్ బ్లూ కలర్ డ్రెస్ ధరించి, గోల్డెన్ అవర్ వెలుతురులో మెరిసిపోతున్న ఆమె ఫోటోలకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం నెటిజన్ల కంటపడింది. అంతే అప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియని లిజ్ లాజ్ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఫోటోగ్రాఫర్ అద్వైత్ ఈ విషయాన్ని స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేస్తూ.. "సాక్షాత్తు గోట్ (GOAT) విరాట్ కోహ్లీ మా పోస్ట్‌ను లైక్ చేయడం నమ్మలేకపోతున్నాం. నేను, లిజ్ ఇంకా కళ్లు నలుపుకుని చూసుకుంటున్నాం" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఎవరీ లిజ్ లాజ్?

కోహ్లీ లైక్ చేసిన తర్వాత ఈమె ఎవరబ్బా? అని నెటిజన్లు గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు. లిజ్ లాజ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈమె జర్మనీకి చెందిన మోడల్. సగం జర్మన్, సగం సౌత్ ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయి.

ఈమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్‌తో పాటు వ్లాగర్, సింగర్‌గా కూడా గుర్తింపు పొందింది. ఆమె తరచూ భారతీయ ఫోటోగ్రాఫర్లు, కళాకారులతో కలిసి పనిచేస్తుంటుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

మళ్ళీ 'అల్గారిథమ్' మ్యాజిక్కేనా?

"మార్క్ జుకర్‌బర్గ్ వెంటనే రాజీనామా చేయాలి.. మళ్ళీ అల్గారిథమ్ గ్లిచ్ అయింది!" అని ఒకరు.. "అనుష్క కోసం మరో వివరణాత్మక పారాగ్రాఫ్ లోడింగ్.." అని మరొకరు ఎక్స్‌లో మీమ్స్ కురిపిస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం "అతను కేవలం ఫోటో బాగుంటే లైక్ చేశాడు, ఇందులో తప్పేముంది?" అని వెనకేసుకొస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. విరాట్ కోహ్లీ ఎవరి ఫోటోను లైక్ చేశారు?

జర్మనీకి చెందిన మోడల్, వ్లాగర్ లిజ్ లాజ్ (Liz Laz) ఫోటోలను కోహ్లీ లైక్ చేశారు.

2. లిజ్ లాజ్ వృత్తి ఏమిటి?

ఆమె ఒక మోడల్, సింగర్, సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన విద్యావంతురాలు.

3. గతంలో ఇలాగే ఏ నటి ఫోటోను కోహ్లీ లైక్ చేశారు?

గతంలో బాలీవుడ్ యువ నటి అవనీత్ కౌర్ ఫోటోను కోహ్లీ లైక్ చేయడం వివాదాస్పదమైంది. దానికి ఆయన 'అల్గారిథమ్ పొరపాటు' అని వివరణ ఇచ్చారు.

4. ఈ విషయంపై విరాట్ కోహ్లీ స్పందించారా?

ప్రస్తుతానికైతే విరాట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe