...
...
Next Story

మహేష్ బాబు నా ఫేవరెట్ హీరో.. అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలూ చూస్తాను.. రిటైర్ అయిన తర్వాత అదే పని చేస్తున్నా: సెహ్వాగ్

టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్ మన మహేష్ బాబుకు పెద్ద అభిమాని అట. ఈ విషయం అతడే చెప్పాడు. అంతేకాదు తాను రిటైర్ అయిన తర్వాత అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలూ చూస్తున్నట్లు తెలిపాడు.

Published on: Dec 23, 2025, 17:19:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

హైదరాబాద్‌లో జరిగిన టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) లాంచ్ ఈవెంట్‌లో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సందడి చేశాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్‌లపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు. రిటైర్ అయ్యాక తాను ఎక్కువగా వీళ్ళ సినిమలే చూస్తున్నానని సెహ్వాగ్ సరదాగా వ్యాఖ్యానించాడు.

నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు

మహేష్ బాబు నా ఫేవరెట్ హీరో.. అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలూ చూస్తాను.. రిటైర్ అయిన తర్వాత అదే పని చేస్తున్నా: సెహ్వాగ్ (PTI)
మహేష్ బాబు నా ఫేవరెట్ హీరో.. అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలూ చూస్తాను.. రిటైర్ అయిన తర్వాత అదే పని చేస్తున్నా: సెహ్వాగ్ (PTI)

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా హైదరాబాద్ వచ్చాడు. దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) లాంచ్ ఈవెంట్‌లో అతడు పాల్గొన్నాడు. ఈ వేదికపై సెహ్వాగ్ తెలుగు సినిమాల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సౌత్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన సెహ్వాగ్.. తన ఫేవరెట్ హీరో ఎవరనేది రివీల్ చేశాడు. "మహేష్ బాబు నా ఫేవరెట్ తెలుగు హీరో. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అలాగే అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు కూడా రెగ్యులర్ గా చూస్తుంటా. 'బాహుబలి' సినిమాను రెండు సార్లు చూశాను" అని సెహ్వాగ్ తెలిపాడు.

రిటైర్మెంట్ జోక్

క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఏం చేస్తున్నారు అని అడగ్గా.. సెహ్వాగ్ తనదైన శైలిలో జోక్ చేశాడు. "2015లో రిటైర్ అయ్యాను కదా.. ఇక నాకు చేయడానికి పనేముంది? ఖాళీగా ఉన్నప్పుడు మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా" అని నవ్వించాడు. తనకు తెలుగు, తమిళం రాదు కాబట్టి హిందీలోకి డబ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తానన్నారు.

'పుష్ప' డైలాగ్.. తగ్గేదే లే!

ఇక సెహ్వాగ్ కు ఇష్టమైన టాలీవుడ్ హీరోల్లో ఇప్పుడు ఎవరేం చేస్తున్నారో చూడండి. మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' (Varanasi)లో నటిస్తున్నాడు.

అటు అల్లు అర్జున్ 'పుష్ప 2'తో రికార్డులు తిరగరాశాడు. ఇక ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'తో రూ. 1000 కోట్లు కొల్లగొట్టాడు. త్వరలో 'ది రాజా సాబ్', 'స్పిరిట్', 'ఫౌజీ' చిత్రాలతో రానున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe