...
...
Next Story

విరోష్ పెళ్లి సందడి.. స్పెషల్ మెనూ కార్డ్.. పూల్‌లో వాలీబాల్.. ఫొటోలు షేర్ చేసిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ.. వైరల్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి షురూ అయింది. ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకల ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకుంది. ఇవాళ మెహందీ, సంగీత్ ఈవెంట్స్ జరగబోతున్నాయని తెలిసింది.

Published on: Feb 24, 2026, 12:15:23 IST
Advertisement

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పెళ్లి సందడి షురూ అయింది. ఈ టాలీవుడ్ వైరల్ జోడీ వెడ్డింగ్ యాక్టివిటీస్ మొదలయ్యాయి. విరోష్ పెళ్లి వేడుకలు ఊపందుకున్నాయి. ఉదయ్‌పూర్‌లో జరిగే వీళ్ల వివాహం సంబరాలు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. రష్మిక, విజయ్ సోషల్ మీడియా పోస్టులతో వీటిపై క్లారిటీ వచ్చింది.

రష్మిక, విజయ్ పెళ్లి

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ

లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ వివాహం కోసం ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి రష్మిక, విజయ్ ఇన్ స్టాలో షేర్ చేసిన స్టోరీలు వైరల్ గా మారాయి.

వాాలీబాల్ ఆడుతూ

స్విమ్మింగ్ పూల్ లో వాలీబాల్ ఆడుతున్న ఫొటోను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నాడు. వాలీబాల్ నెట్ నుంచి తీసిన ఆ ఫోటోలో కొంతమంది సరదాగా గేమ్ ఆడుతున్నట్లు ఉన్నారు. దీన్ని బట్టి పెళ్లి కొడుకు విజయ్ దేవరకొండ తరపు వాళ్లు ఉత్సాహంగా వాలీబాల్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.

రష్మిక పోస్ట్

కాబోయే పెళ్లికూతురు రష్మిక మందన్న కూడా ఓ ఫొటో షేర్ చేసింది. గోల్డ్ కలర్ లో చక్కగా అలంకరించిన డిన్నర్ టేబుల్ ఫొటోను ఆమె పంచుకుంది. ఇందులో దీపాల వెలుగులో గులాబీ లిల్లీస్, ఆకుపచ్చ హైడ్రేంజాలతో అలంకరించిన పొడవైన టేబుల్ పై గ్రీన్ ఆపిల్స్, ద్రాక్షలు కనిపిస్తున్నాయి. విరోష్ అని కస్టమైజ్ చేసిన మెనూ కార్డ్ స్పెషల్ గా నిలిచింది. ప్రతి నాప్కిన్ పై కూడా విరోష్ అని ఉంది.

రష్మిక, విజయ్ ఇన్ స్టా స్టోరీలు

ఆ హోటల్లో

రష్మిక, విజయ్ దేవరకొండ 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోబోతున్నారు. 2018లో వచ్చిన 'గీత గోవిందం', 2019లో రిలీజైన 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో రష్మిక, విజయ్ కలిసి నటించారు.

రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లికి కేవలం 100 మంది అతిథులను మాత్రమే పిలిచినట్లు తెలిసింది. వెడ్డింగ్ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అటెండ్ కాబోతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks