...
...
Next Story

Vishal: ఆ సినిమాలో ఎన్టీఆర్ క్లైమాక్స్ యాక్టింగ్ చూసి మైండ్ బ్లాక్.. స్క్రిప్ట్ కూడా మరిచిపోయా: విశాల్ సంచలన కామెంట్స్

Vishal: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన కల్ట్ క్లాసిక్ ‘టెంపర్’ క్లైమాక్స్ సీన్‌పై తమిళ అగ్ర నటుడు విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ పండించిన ఎమోషన్ చూసి తాను స్క్రిప్ట్ కూడా మరిచిపోయానని, ఆ పవర్‌ఫుల్ మ్యాజిక్‌ను తమిళ ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే రీమేక్ చేశానని విశాల్ చెప్పాడు.

Published on: Aug 10, 2026, 05:38:54 IST
Advertisement

Vishal: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' (Temper) చిత్రం టాలీవుడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాల్లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ కోర్టు సీన్, పోలీస్ స్టేషన్ సీన్లలో ఎన్టీఆర్ పండించిన విశ్వరూపం, పవర్‌ఫుల్ ఎమోషనల్ డైలాగ్ డెలివరీ ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసింది.

ఆ సినిమాలో ఎన్టీఆర్ క్లైమాక్స్ యాక్టింగ్ చూసి మైండ్ బ్లాక్.. స్క్రిప్ట్ కూడా మరిచిపోయా: విశాల్ సంచలన కామెంట్స్
ఆ సినిమాలో ఎన్టీఆర్ క్లైమాక్స్ యాక్టింగ్ చూసి మైండ్ బ్లాక్.. స్క్రిప్ట్ కూడా మరిచిపోయా: విశాల్ సంచలన కామెంట్స్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళ స్టార్ హీరో విశాల్.. టెంపర్ లో ఎన్టీఆర్ నటనపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ యాక్టింగ్ కు ఫిదా

"టెంపర్ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అన్ మ్యాచబుల్. ఆయన చేసిన ఆ నటనను మరెవరూ రీక్రియేట్ చేయలేరు! అంతటి అద్భుతమైన మ్యాజిక్‌ను నా తమిళ రీమేక్ ద్వారా మరింత మందికి రీచ్ అయ్యేలా చూడాలనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే నేను ఆ సినిమాను రీమేక్ చేశాను" అని విశాల్ ఓపెన్‌గా వెల్లడించారు.

స్క్రిప్ట్ పక్కనపెట్టి

'టెంపర్' సినిమా చూస్తున్నప్పుడు తనలో కలిగిన అనుభూతిని విశాల్ ఎంతో భావోద్వేగంగా పంచుకున్నాడు. "ఎన్టీఆర్ యాక్టింగ్ చూస్తున్న సమయంలో నేను అసలు స్క్రిప్ట్ ఏంటి అనే విషయమే పూర్తిగా మరిచిపోయా. ఆయన ప్లే చేసిన ఎమోషన్స్ నన్ను అలా స్టన్ అయ్యేలా చేశాయి’’ అని విశాల్ చెప్పాడు.

అగ్నిపర్వతం పేలినట్లు

"కెమెరా ముందుకు వచ్చి ఎన్టీఆర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై ఒక అగ్నిపర్వతం పేలినట్లు అనిపిస్తుంది. ఆయనలోని ఎనర్జీ, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్" అని విశాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన మకుటం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ టాక్ షోలో విశాల్ ఈ కామెంట్లు చేశాడు.

రీమేక్‌లోనూ చెరగని ముద్ర!

సాధారణంగా ఒక లెజెండరీ పర్ఫార్మెన్స్‌ను రీమేక్ చేయడం ఏ హీరోకైనా పెద్ద సవాలే. కానీ ఎన్టీఆర్ చూపించిన ఆ నటన పట్ల ఉన్న గౌరవంతోనే తాను ఆ రీమేక్ సాహసం చేశానని విశాల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ కామెంట్స్‌ను ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రియులు నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

విశాల్ కామెంట్లతో

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ వర్సటైలిటీ, ఎమోషనల్ ఇంటెన్సిటీకి ఇతర భాషల స్టార్ హీరోలు సైతం ఎంతటి అభిమానులో విశాల్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. కేవలం కమర్షియల్ సేఫ్టీ కోసం కాకుండా, ఒక నటుడి సీన్ మ్యాజిక్‌ను మరో భాషలోకి తీసుకెళ్లాలనే విశాల్ ఆలోచన ఆయనకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌కు నిదర్శనం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks