VI OTT Plan 35 Rs: కేవలం 35 రూపాయలతో 2 ఓటీటీలు- మీకు నచ్చిన ఏవైనా ఓటీటీల్లో చూడొచ్చు- వొండాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్!
Vodafone Idea OTT Plan 35 Rs: తక్కువ ఖర్చుతో ఓటీటీ వినోదాన్ని కోరుకునే ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వొడాఫోన్ ఐడియా కేవలం 35 రూపాయలతో కొత్త డేటా వోచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఏవైనా 2 ఓటీటీల్లోని కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చు.
Vodafone Idea OTT Plan 35 Rs: తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే మొబైల్ వినియోగదారుల కోసం వొడాఫోన్ ఐడియా (Vi) కొత్త డేటా వోచర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 35 రీఛార్జ్‌తో 7 రోజుల డేటాతో పాటు పూర్తి 28 రోజుల పాటు రెండు ప్రీమియం ఓటీటీ సేవలను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

విఐ రూ. 35 ప్లాన్ వివరాలు – రోజుకు రూ. 5 మాత్రమే!
టెలికాం రంగంలో పోటీని తట్టుకుంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వొడాఫోన్ ఐడియా ఈ ఆకర్షణీయమైన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ఓటీటీల్లోని వినోదాన్ని కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని రూ. 35 ధరతో ఈ ప్రీపెయిడ్ డేటా వోచర్‌ను విడుదల చేసింది.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులు ఉంటుంది. రోజువారీ వ్యయం లెక్కిస్తే కేవలం రూ. 5 మాత్రమే పడుతుంది. ఇది ఒక డేటా వోచర్ కాబట్టి వినియోగదారులు మొత్తం 1 జీబీ డేటాను పొందుతారు. ఈ 1జీబీ డేటాను 7 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఒకే రోజులో ఉపయోగించినా లేదా ఏడు రోజుల పాటు కొద్దికొద్దిగా వాడుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు.
గడువు ముగిసిన తర్వాత మిగిలిన డేటా రద్దవుతుంది. అయితే, దీనికి ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు. కాలింగ్ లేదా ఎస్సెమ్మెస్ అవసరాల కోసం మెయిన్ ప్లాన్ ఎప్పటిలా ఉండాల్సిందే.
వారానికి డేటా.. నెలకు రెండు ఓటీటీలు!
ఈ ప్లాన్‌లోని అసలైన హైలైట్ ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్. డేటా వ్యాలిడిటీ వారం రోజులే అయినప్పటికీ, ఇందులో లభించే ఓటీటీ సేవలు మాత్రం ఏకంగా 28 రోజుల పాటు పనిచేస్తాయి.
విఐ మూవీస్ అండ్ టీవీ (Vi Movies & TV) యాప్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ఏవైనా రెండు ప్రీమియం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా ఎంచుకోవచ్చు. కేవలం రూ. 35 ఖర్చుతో నెల రోజులకు సరిపడా వినోదం లభించడం డిజిటల్ ప్రియులకు విపరీతంగా కలసివచ్చే అంశం.
డేటా అవసరం లేని వారి కోసం 'వాయిస్-ఓన్లీ' ప్లాన్లు
స్మార్ట్‌ఫోన్లు వాడకుండా కేవలం కాలింగ్ సేవలే కోరుకునే వినియోగదారుల కోసం విఐ మూడు సరికొత్త 'వాయిస్-ఓన్లీ' ప్లాన్లను కూడా ప్రవేశపెట్టింది. రూ. 142, రూ. 156, రూ. 158 ధరలతో ఇవి కొన్ని ఎంపిక చేసిన టెలికాం సర్కిళ్లలో లభిస్తున్నాయి.
రూ. 142 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు మొత్తం 300 ఎస్సెమ్మెస్‌లు పొందే వీలుంది.
రూ. 156 ప్లాన్: నెల రోజుల కాలపరిమితి కోరుకునే వారికి ఇది అనువుగా ఉంటుంది. 30 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.
రూ. 158 ప్లాన్: కచ్చితంగా ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత టాక్‌టైమ్, 300 ఎస్సెమ్మెస్ సదుపాయం ఉంటుంది.
ఇంట్లో ఉండే పెద్దవారికి
ఈ కాలింగ్ ప్లాన్లలో ఎలాంటి డేటా ప్రయోజనాలు ఉండవని కంపెనీ స్పష్టం చేసింది. సెకండరీ సిమ్‌గా వాడే వారికి లేదా ఇంట్లో ఉండే పెద్దవారికి ఇవి సరైన ఎంపికగా నిలుస్తాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


