Vrushakarma OTT: అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథిలాజికల్ మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' (Vrushakarma) టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఇంకా థియేటర్లలోకి రాకముందే ఈ సినిమా నాన్-థియేట్రికల్ మార్కెట్‌లో హాట్ కేకులా అమ్ముడుపోయింది.
వృషకర్మ ఓటీటీ

తండేల్ మూవీతో తన కెరీర్ లోనే ఫస్ట్ రూ.100 కోట్ల మూవీ అందుకున్న నాగ చైతన్య జోరుమీదున్నారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ‘వృషకర్మ’. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో భారీ ధరకు డిజిటల్, శాటిలైట్ హక్కులను దక్కించుకుందని సమాచారం.
ఆ క్రేజీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటి?
ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'వృషకర్మ' నాన్-థియేట్రికల్ హక్కులను (డిజిటల్ స్ట్రీమింగ్ + టెలివిజన్ శాటిలైట్ రైట్స్) ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) సొంతం చేసుకుందని తెలిసింది. సినిమా గ్లింప్స్ సృష్టించిన ఇంపాక్ట్, కథలోని వైవిధ్యం చూసి మేకర్స్ అడిగిన రేటుకు జీ5 డీల్ క్లోజ్ చేసిందని ఇండస్ట్రీ టాక్.
డీల్ విలువ ఎంతో తెలుసా?
నాగ చైతన్య కెరీర్‌లోనే ఇది కళ్లు చెదిరే సరికొత్త రికార్డు డీల్ అని చెప్పాలి. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.50 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కేవలం నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారానే దాదాపు సగం నిర్మాణ వ్యయాన్ని రిలీజ్‌కు ముందే రికవరీ చేసుకోవడం విశేషం.
వృషకర్మ మూవీ స్పెషాలిటీ ఏంటి?
'విరూపాక్ష' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పురాతన రహస్యాలు, లూటీ అయిన పురాతన అవశేషాలు, మిస్టరీ ఎలిమెంట్స్ చుట్టూ ఈ కథ తిరగనుంది. ఈ సినిమాలో నాగ చైతన్య ఇప్పటివరకు కనిపించని ఒక ఇంటెన్స్, స్టైలిష్ అండ్ పవర్ఫుల్ అవతారంలో కనిపించబోతున్నారు.
రిలీజ్ డేట్
{{/usCountry}}'విరూపాక్ష' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పురాతన రహస్యాలు, లూటీ అయిన పురాతన అవశేషాలు, మిస్టరీ ఎలిమెంట్స్ చుట్టూ ఈ కథ తిరగనుంది. ఈ సినిమాలో నాగ చైతన్య ఇప్పటివరకు కనిపించని ఒక ఇంటెన్స్, స్టైలిష్ అండ్ పవర్ఫుల్ అవతారంలో కనిపించబోతున్నారు.
రిలీజ్ డేట్
{{/usCountry}}వృషకర్మ మూవీ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తోంది. స్పర్ష్ శ్రీవాస్తవ్, జయరామ్, సత్య, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బీవీఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడుతో పాటు టాప్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వృషకర్మ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.