...
...
Next Story

Weekend OTT: వీకెండ్ వచ్చేసింది గురూ-మలయాళం హారర్ నుంచి తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వరకు-ఈ ఓటీటీ వాచ్ లిస్ట్ మిస్ కావొద్దు!

Weekend OTT: ఓటీటీ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని అందించేందుకు మరో వీకెండ్ సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, జియోహాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్‌కు వచ్చిన సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు మీకోసం. ఇంకెందుకు లేటు వెంటనే ఓ లుక్కేయండి.

Published on: Jul 24, 2026, 21:50:38 IST
Advertisement

Weekend OTT: వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త వినోదం కోసం ఎదురుచూస్తుంటారు. ఈ వీకెండ్ వినోదాన్ని పంచడానికి విభిన్న జోనర్లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ వేదికలపైకి వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీలివ్, లయన్స్ గేట్ ప్లే వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన ఆసక్తికరమైన కంటెంట్ వివరాలను చూసేయండి.

పల్లిచట్టంబి (SonyLIV)

వీకెండ్ వచ్చేసింది గురూ-మలయాళం హారర్ నుంచి తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వరకు-ఈ ఓటీటీ వాచ్ లిస్ట్ మిస్ కావొద్దు!
వీకెండ్ వచ్చేసింది గురూ-మలయాళం హారర్ నుంచి తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వరకు-ఈ ఓటీటీ వాచ్ లిస్ట్ మిస్ కావొద్దు!

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటించిన పీరియడ్ డ్రామా చిత్రం 'పల్లిచట్టంబి'. 1950ల నాటి కేరళ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా కథ సమాజంలో పెరుగుతున్న రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతల నడుమ సాగుతుంది. ఇందులో 'పోతన్' అనే పాత్ర ప్రయాణాన్ని దర్శకుడు ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.

ఈ చిత్రంలో టోవినో థామస్‌తో పాటు కాయదు లోహర్, విజయరాఘవన్, సిద్ధిక్, బాబురాజ్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించారు. జూలై 24 నుంచి సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రం ప్రసారమవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కాన్ సిటీ (Netflix)

అర్జున్ దాస్, అన్నా బెన్ కాంబినేషన్‌లో వచ్చిన ఆసక్తికరమైన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'కాన్ సిటీ'. ఒక ముఠా తమ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ను దాచి, సాధారణ మధ్యతరగతి కుటుంబంగా నటిస్తూ కర్ణాటకలోని ముల్కీలో ఒక చిన్న హోటల్ నడుపుతుంటుంది. వారు వేసే తదుపరి దోపిడీ ప్లాన్ ఏమిటి, ఆ తర్వాత ఏం జరిగిందనే అంశాలతో కథ ఉత్కంఠగా సాగుతుంది.

దివ్య ప్రకాష్ దూబే రాసిన పాపులర్ హిందీ నవల ఆధారంగా ‘ముసాఫిర్ కేఫ్’ సిరీస్ ను తెరకెక్కించారు. విక్రాంత్ మాస్సీ, వేదిక పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హృద్యమైన సిరీస్ జూలై 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. తను ప్రేమించిన అమ్మాయి దూరమైన తర్వాత చందర్ మరో అమ్మాయికి దగ్గరవుతాడు. అతని జీవితంలో మాజీ ప్రేయసి తిరిగొస్తే ఎలా ఉంటుందన్నదే ఈ సిరీస్ కథ.

స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ (JioHotstar / HBO Max)

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సరికొత్త కామెడీ సిరీస్ 'స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్'. కామిక్ బుక్ షాప్ యజమాని స్టువర్ట్.. షెల్డన్, లియోనార్డ్ తయారు చేసిన ఒక పరికరాన్ని ప్రమాదవశాత్తు పాడుచేసి మల్టీవర్స్‌లోకి ప్రవేశిస్తాడు.

ఆ మల్టీవర్స్ చిక్కుల నుంచి బయటపడేందుకు తన పాత ప్రేమికురాలు డెనిస్, జియాలజీ నిపుణుడు బెర్ట్, క్యాల్‌టెక్ బారీ క్రిప్కే సాయం తీసుకుంటాడు. కేవిన్ సుస్మాన్, లోరెన్ లాప్కస్, బ్రయాన్ పోసెన్, జాన్ రాస్ బోవీ నటించిన ఈ సిరీస్ జూలై 23 నుంచి జియోహాట్‌స్టార్, హెచ్‌బీవో మ్యాక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఆదర్శ్ బాల విద్యాలయ (Amazon Prime Video)

ఒక ప్రభుత్వ పాఠశాల కథాంశంతో రూపుదిద్దుకున్న ఏడు ఎపిసోడ్ల సిరీస్ 'ఆదర్శ్ బాల విద్యాలయ'. ప్రధానోపాధ్యాయుడు జ్ఞానేశ్వర్ తివారిగా నటుడు కే కే మీనన్ నటించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పడిపోయిన విద్యావ్యవస్థ మధ్య ఆయన ఎదుర్కొన్న సవాళ్లను హాస్యంతో పాటు ఆలోచింపజేసేలా తెరకెక్కించారు.

జూలై 24 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇందులో అర్చనా పూరన్ సింగ్, నవీన్ కస్తూరియా, దేవేన్ భోజానీ, అభిమన్యు సింగ్, ప్రసన్న బిష్ట్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ప్రొటెక్టర్ (Lionsgate Play)

మిల్లా జోవోవిచ్ కథానాయికగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ప్రొటెక్టర్'. "మాజీ యుద్ధ వీరురాలు నిక్కీ తన కుమార్తె కిడ్నాప్‌తో షాక్ కు గురవుతుంది. పోలీసులు, మిలిటరీ తనను వేటాడుతున్న సమయంలోనే క్రిమినల్ వరల్డ్ లోకి అడుగుపెట్టి తన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె చేసిన పోరాటమే ఈ చిత్రం జూలై 24 నుంచి లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఉంది.

నాగబంధం (Primve video)

అనంత పద్మనాభస్వామి ఆలయం, నిధి చుట్టూ సాగే కథతో తెరకెక్కిన సినిమానే ‘నాగబంధం’. అనంత పద్మనాభ స్వామి గుడిలోని పవిత్రమైన 'బ్రహ్మకమలం', 'నాగబంధం' సంప్రదాయం ఇందులో కీలకం.ఈ చిత్రం ఇవాళ (జూలై 24) నుంచే ప్రైమ్ వీడియోలో ప్లే అవుతోంది.

సీక్రెట్ ఆఫ్ కళింగ (Sun NXT)

ఇదో మలయాళ హారర్ థ్రిల్లర్. ఒక పురాతన బావిలో శతాబ్దాల క్రితం బంధించిన ఒక యువరాణి ఆత్మ ఉంటుంది. న్యూ ఇయర్ రోజు విద్యార్థులు అనుకోకుండా ఆ బావి సీల్ ఓపెన్ చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. సీక్రెట్ ఆఫ్ కళింగ మూవీ సన్ నెక్ట్స్ లో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe