...
...
Next Story

బాలీవుడ్‌లో టైటానిక్ తీస్తే? రోజ్‌గా ఐశ్వ‌ర్య‌రాయ్‌.. జాక్‌గా రాజేష్ ఖ‌న్నా.. అదిరిపోయిన ఏఐ వీడియో.. అద్భుత‌మంటూ కామెంట్

ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'టైటానిక్' ను బాలీవుడ్ లో తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందులో హీరోయిన్ రోజ్ గా అందాల తార ఐశ్వర్యరాయ్, హీరో జాక్ గా దివంగత నటుడు రాజేష్ ఖన్నా నటిస్తే ఇంకెలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని ఏఐ నిజం చేసింది. ఏఐతో చేసిన ఈ సూపర్ విజువల్స్ వైరల్ గా మారాయి.

Published on: Feb 8, 2026, 14:15:32 IST
Advertisement

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్, హ్యాండ్సమ్ నటుడు రాజేష్ ఖన్నా.. ఈ ఇద్దరు వేర్వేరు తరాలకు చెందిన నటీనటులు. కానీ ఈ ఇద్దరూ కలిసి పాపులర్ మూవీ టైటానిక్ లో నటిస్తే? రోజ్, జాక్ పాత్రలు పోషిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే ఓ అద్భుతమైన ఏఐ వీడియో క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

ఐశ్వర్య, రాజేష్ కలిసి

ఏఐ ఫొటోలు
ఏఐ ఫొటోలు

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఏఐ వీడియోలో హాలీవుడ్ చిత్రం 'టైటానిక్' లోని కేట్ విన్స్‌లెట్, లియోనార్డో డికాప్రియో పాత్రలలో బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్, రాజేష్ ఖన్నా కనిపించారు. అభిమానుల మదిలో ఇంకా తాజాగా ఉన్న టైటానిక్ సినిమాలోని కొన్ని సీన్లలో ఈ ఇద్దరిని ఇప్పుడు చూడొచ్చు.

అదిరే వీడియో

మిస్టర్ హెల్ రాకర్ అనే ఏఐ ఆర్టిస్ట్ ఐశ్వర్యరాయ్, రాజేష్ ఖన్నాతో టైటానిక్ సినిమాలోని కొన్ని సీన్లను ఏఐలో రీక్రియేట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఐశ్వర్యరాయ్‌ను 'రోజ్' గా, రాజేష్ ఖన్నాను 'టైటానిక్' లో 'జాక్' గా చూపే సన్నివేశాల సిరీస్‌ను పోస్టు చేశాడు.

సూటు ధరించిన జాక్‌ను మొదటిసారి కలవడానికి హాల్‌వేలోకి రోజ్ అడుగుపెట్టడం దగ్గర నుంచి, టైటానిక్ డెక్‌పై ఇద్దరు కలిసి నిలబడే ఐకానిక్ పోజు వరకు ఈ సీన్లున్నాయి.

పర్పెక్ట్ గా

‘‘టైటానిక్ బాలీవుడ్‌లో తీస్తే ఎలా ఉంటుంది? ఐశ్వర్యారాయ్ 'రోజ్' గా, రాజేష్ ఖన్నా 'జాక్' గా ఊహించని కలయిక ఇది’’ అనే క్యాప్షన్ తో ఇన్ స్టాలో వీడియో పోస్టు చేశారు.

ఫ్యాన్స్ రియాక్షన్

ఐశ్వర్యరాయ్, రాజేష్ ఖన్నాతో రూపొందించిన టైటానిక్ ఏఐ వీడియో అద్భుతమని, అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా రాజేష్ ఖన్నా 'జాక్' గా ఎంత పరిపూర్ణంగా కనిపిస్తున్నాడో అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. 'జాక్ గా రాజేష్ ఖన్నా సర్ అద్భుతం. ఇది క్రియేటివిటీకి నిలువెత్తు నిదర్శనం' అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. 'ఐశ్వర్యరాయ్ అసలు రోజ్ కంటే ఎక్కువ రోజ్ లా ఉంది' అని మరొక అభిమాని అన్నారు.

రాజేష్ ఖన్నా 1960ల నుండి 1970ల మధ్యకాలంలో బాక్సాఫీస్‌ను శాసించిన సూపర్ స్టార్. ఐశ్వర్యరాయ్ ఆయన కంటే మూడు దశాబ్దాలు చిన్నది. అయితే ఈ ఇద్దరు 1999లో వచ్చిన 'ఆ అబ్ లౌట్ చలేన్' చిత్రంలో నటించారు. రిషి కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నాకు రాజేష్ తండ్రిగా నటించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe