...
...
Next Story

Ram Charan: రామ్ చరణ్ ప్లాన్ మామూలుగా లేదుగా.. పెద్ది తర్వాత రెండు క్రేజీ మూవీస్.. లైనప్ లో ఆ సంచలన డైరెక్టర్.. ఎవరంటే?

Ram Charan: పెద్ది సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు. రికార్డుల వేటకు సై అంటున్నాడు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత చెర్రీ చేసే రెండు క్రేజీ ప్రాజెక్ట్ లపై బజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: May 24, 2026, 13:44:40 IST
Advertisement

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. ఆయన ప్లాన్ కూడా వేరే లెవల్ లో ఉంది. ప్రస్తుతం పెద్ది మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు మెగా పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది.

పెద్ది తర్వాత ఏంటీ?

రామ్ చరణ్ లైనప్ లో క్రేజీ సినిమాలు (PTI)
రామ్ చరణ్ లైనప్ లో క్రేజీ సినిమాలు (PTI)

రామ్ చరణ్ పెద్ది మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ రిలీజ్ కోసం అటు మెగా ఫ్యాన్స్, ఇటు సినీ లవర్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లకు వస్తుంది. మరి పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాలు ఏంటీ? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

రెండు క్రేజీ మూవీస్

రామ్ చరణ్ లైనప్ లో ఇప్పుడు రెండు క్రేజీ మూవీస్ ఉన్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. పెద్ది తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఆర్సీ 17 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీ అయిపోయాడు. ఇప్పటికే సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఆ సంచలన డైరెక్టర్

మరోవైపు ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటిస్తున్నాడు. అతని పక్కన త్రిప్తి డిమ్రి హీరోయిన్.

పెద్ది రిలీజ్ డేట్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న రిలీజ్ కానుంది. దీనికి బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఇందులో జగపతి బాబు, శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ పెద్ది మూవీకి మ్యూజిక్ అందించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks