ప్రపంచ సినిమాకు పట్టం కట్టే ఈవెంట్ మరోసారి రాబోతుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును అందుకోవాలని మూవీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ కల కంటారు. అదే ఆస్కార్స్. ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు రంగం సిద్ధమవుతోంది. మరి ఈ అకాడమీ అవార్డుల ప్రోగ్రామ్ ను ఇండియాలో ఎప్పుడు? ఎక్కడ? లైవ్ చూడాలో తెలుసుకోండి.
ఆస్కార్స్ 2026

ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా ప్రోగ్రాం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న హాలీవుడ్ డాల్బీ థియేటర్లో జరుగుతుంది. అమెరికా టైమ్ ప్రకారం ఈ 98వ అకాడమీ అవార్డులు మార్చి 15, 2026న విజేతలకు అందిస్తారు. 2025లో రిలీజైన సినిమాలకు గాను డిఫరెంట్ విభాగాల్లో ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు.
టైమ్ ఇదే
అమెరికా టైమ్ ప్రకారం ఆస్కార్స్ 2026 ఈవెంట్ మార్చి 15న రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాల్లో, ప్రాంతాల్లో ఈ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని వ్యూయర్స్ ఈ ఈవెంట్ ను ఏబీసీ నెట్ వర్క్ లో చూడొచ్చు. ఆన్ లైన్ లోనేమో హులు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇండియాలో ఇలా
98వ అకాడమీ అవార్డుల ఈవెంట్ ను ఇండియాలోని ఆడియన్స్ కూడా చూడొచ్చు. భారత కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ మార్చి 16, 2026న స్ట్రీమింగ్ అవుతుంది. ఉదయం 4.30 గంటల నుంచి ఇండియాలో ఈ ఈవెంట్ ను చూడొచ్చు. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్ఫినిటీ ఛానెల్స్ లో ఈ ఈవెంట్ ప్రీమియర్ అవుతుంది. ఓటీటీ విషయానికి వస్తే జియోహాట్ స్టార్ లో ఆస్కార్స్ ఈవెంట్ స్ట్రీమింగ్ కానుంది.
హోస్ట్ అతనే
ఆస్కార్స్ 2026కు పాపులర్ కమెడియన్ ఓ బ్రియన్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. 2025లోనూ ఈ ఈవెంట్ కు అతనే యాంకర్ గా వ్యవహరించాడు. ఈ సారి కూడా అతనే హోస్ట్ గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆస్కార్స్ కన్ఫామ్ చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా అకాడమీ అవార్డుల ఈవెంట్ ను హోస్ట్ చేసిన అతి కొద్ది మందిలో ఓ బ్రియన్ ఒకడిగా నిలవబోతున్నాడు.
{{/usCountry}}ఆస్కార్స్ 2026కు పాపులర్ కమెడియన్ ఓ బ్రియన్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. 2025లోనూ ఈ ఈవెంట్ కు అతనే యాంకర్ గా వ్యవహరించాడు. ఈ సారి కూడా అతనే హోస్ట్ గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆస్కార్స్ కన్ఫామ్ చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా అకాడమీ అవార్డుల ఈవెంట్ ను హోస్ట్ చేసిన అతి కొద్ది మందిలో ఓ బ్రియన్ ఒకడిగా నిలవబోతున్నాడు.
{{/usCountry}}ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు జేవియర్ బార్డెమ్, క్రిస్ ఎవాన్స్, డెమి మూర్, కుమైల్ నంజియాని, మాయా రుడాల్ఫ్ లాంటి స్టార్లు ప్రజెంటర్లుగా వ్యవహరించనున్నారు. మరి ఈ ఈవెంట్లో ఏ సినిమా అదరగొడుతుందో? ఎవరు బెస్ట్ హీరోగా నిలుస్తారో చూడాలి.