Sanskruti Jayana: రాజకీయ నాయకుల వారసులు రాజకీయాల్లోకి వెళ్తారు. కానీ సంస్కృతి జయన మాత్రం డిఫరెంట్ మార్గాన్ని ఎంచుకుంది. యాక్టింగ్ వైపు వచ్చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్’ (Krishnavataram) చిత్రంతో సంస్కృతి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.
ఎవరీ సంస్కృతి జయన?

ఇప్పుడు సంస్కృతి జయన పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరు అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ మనవరాలే ఈ సంస్కృతి జయన. ఇప్పుడు ఆమె వెండితెరకు పరిచయం అవుతుంది.
మల్టీ టాలెంటెడ్
సంస్కృతి జయనను చూస్తే బ్యూటీ విత్ బ్రెయిన్ అని అనక మానరు. ఈ భామ ఓ వైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు బిజినెస్ లోనూ రాణిస్తోంది. తన సొంత దుస్తుల కలెక్షన్ ను వెబ్ సైట్లో సేల్ చేస్తోంది. దుస్తులను సొంతంగా డిజైన్ కూడా చేస్తోంది.
సత్యభామ పాత్రలో
బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం, సంస్కృతి జయన ‘కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్’ చిత్రంలో శ్రీకృష్ణుని సతీమణి సత్యభామ పాత్రను పోషించింది. తల్లి అనార్ పటేల్ సామాజిక సేవలో (క్రాఫ్ట్ రూట్స్, గ్రామశ్రీ ద్వారా) నిమగ్నమై ఉండగా, సంస్కృతి మాత్రం కళా రంగాన్ని ఎంచుకుంది.
ట్రైలర్ విడుదలైన సందర్భంగా అనార్ పటేల్ తన కుమార్తె గురించి భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. ఎన్నో ఏళ్ల కృషి, పట్టుదల తర్వాతే సంస్కృతి ఈ స్థాయికి చేరుకుందని ఆమె పేర్కొన్నారు.
నటిగానే కాదు.. నిర్మాతగా కూడా!
సంస్కృతి కేవలం ఈ సినిమాలో నటిగా మాత్రమే పరిమితం కాలేదు. ఆమె ‘అథశ్రీ కథా మోషన్ పిక్చర్స్’ (Athashrikatha Motion Pictures) భాగస్వామిగా నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది. దర్శకుడు హార్దిక్ గజ్జర్, పూనమ్ ష్రాఫ్, పార్థ్ గజ్జర్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
గుజరాత్ గడ్డపై
{{/usCountry}}సంస్కృతి కేవలం ఈ సినిమాలో నటిగా మాత్రమే పరిమితం కాలేదు. ఆమె ‘అథశ్రీ కథా మోషన్ పిక్చర్స్’ (Athashrikatha Motion Pictures) భాగస్వామిగా నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది. దర్శకుడు హార్దిక్ గజ్జర్, పూనమ్ ష్రాఫ్, పార్థ్ గజ్జర్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
గుజరాత్ గడ్డపై
{{/usCountry}}సాధారణంగా ఇలాంటి భారీ చిత్రాలు ముంబై లేదా హైదరాబాద్‌లోని స్టూడియోల్లో షూటింగ్ జరుపుకొంటాయి. కానీ ‘కృష్ణావతారం’ కోసం గుజరాత్‌లోని విస్‌నగర్ సమీపంలో అద్భుతమైన సెట్లను నిర్మించారు. విశాలమైన మైదానంలో ఈ సినిమా షూటింగ్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ షూటింగ్ షెడ్యూల్స్ సజావుగా సాగేలా చూడటంలో సంస్కృతి, ఆమె తల్లి అనార్ పటేల్ కీలక పాత్ర పోషించారని సమాచారం.
ట్రైలర్ లాంచ్
ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా విభిన్నంగా సాగుతున్నాయి. కృష్ణ జన్మభూమి మథురలో ఈ చిత్ర ట్రైలర్‌ను అత్యంత భక్తిశ్రద్ధల మధ్య విడుదల చేశారు. ప్రేమ్ మందిర్, ఇస్కాన్ బృందావనం వంటి పవిత్ర క్షేత్రాల్లో ఈ వేడుకలు జరిగాయి. సినిమా ఇతివృత్తానికి తగ్గట్లుగా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను ఎంచుకోవడం సినిమాపై అంచనాలను పెంచింది.
రిలీజ్ డేట్
‘కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్’ చిత్రానికి ప్రముఖ రచయితలు ప్రకాష్ కపాడియా, రామ్ మోరి కథను అందించారు. ఇర్షాద్ కామిల్ సాహిత్యం, ప్రసాద్ ఎస్ సంగీతం సినిమాలోని భక్తి భావాన్ని మరింత ఎలివేట్ చేయనున్నాయి. హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతోంది.
మొదటి భాగం 'కృష్ణావతారం: ది హార్ట్' మే 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.