ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏప్రిల్ నుండి ఇందుకోసం అవసరమైన కార్యాచరణను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్-2026 పోటీల్లో గెలుపొందిన విజేతలను సత్కరించారు మంత్రి. అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలు అందజేశారు. సామాజిక స్పృహతో లఘ చిత్రాలు రూపొందించిన యువదర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.

ఏపీ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జనవరి 11న రాష్ట్రస్థాయిలో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ప్రతిష్టాత్మకంగా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2026 ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్ర ప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల నిర్వాహకుడు, మా-ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకులు దిలీప్ రాజా కృషిని కొనియాడారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై ప్రకటన చేస్తామన్నారు.
'హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్రబిందువుగా మార్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. సామాజిక చైతన్యంతో కూడినటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు దిలీప్ రాజా ఏపీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలని నిరంతరం తపిస్తున్నారు. సినిమా రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.' అని మంత్రి దుర్గేష్ అన్నారు.
కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఔత్సాహిక కళాకారులను మాత్రమే ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 203 షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలురాగా 2 వేల మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ శకునాల తీసిన మహావృక్షం ప్రథమ బహుమతిని పొందగా శ్రీకాకుళానికి చెందిన శ్రీనివాసరావు సింహాద్రి అప్పన్న ద్వితీయ బహుతిని, పాలకొల్లుకు చెందిన నవీన్ కుమార్ ' అబద్దం వర్సెస్ నిజం' తృతీయ బహుమతిని పొందింది. ఈ సందర్భంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు లక్ష రూపాయల నగదును అందించారు.
ఈ సందర్భంగా దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఏపీ యువత అద్భుతాలు సృష్టించగలరని, ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. మరింత ప్రోత్సాహం అందిస్తే ఎవరెస్ట్ నైనా ఎక్కగలమనే దృఢ సంకల్పాన్ని విజేతల్లో నింపామని దిలీప్ రాజా పేర్కొన్నారు.
{{/usCountry}}ఈ సందర్భంగా దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఏపీ యువత అద్భుతాలు సృష్టించగలరని, ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. మరింత ప్రోత్సాహం అందిస్తే ఎవరెస్ట్ నైనా ఎక్కగలమనే దృఢ సంకల్పాన్ని విజేతల్లో నింపామని దిలీప్ రాజా పేర్కొన్నారు.
{{/usCountry}}