ఓటీటీలో ఎన్నో సినిమాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 మూవీస్ ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఇందులో ఎక్కువ వాటా యానిమేటెడ్ సినిమాలదే. ఇందులో 15 వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలున్నాయి.
నీ ఝా 2

2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ‘నీ ఝా 2’ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది చైనా యానిమేటెడ్ మూవీ. ఇది ప్రపంచవ్యాప్తంగా 2.13 బిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుంది. ఇండియా కరెన్సీలో ఇది సుమారు రూ.17,700 కోట్లతో సమానం. నీ ఝా 2 మూవీ నెట్‌ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో అందుబాటులో ఉంది.
లైలో అండ్ స్టిచ్
మరో యానిమేటెడ్ మూవీ లైలో అండ్ స్టిచ్ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన వాటిల్లో ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ అమెరికన్ మూవీ 1 బిలియన్ డాలర్ల వసూళ్లు సొంతం చేసుకుంది. అంటే దాదాపు రూ.8595 కోట్లతో సమానం. ఈ సినిమా జియోహాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ
వార్నర్ బ్రదర్స్ క్రియేట్ చేసిన అడ్వెంచరస్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలో ఇది మూడో ప్లేస్ లో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 957.9 మిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుంది. ఇది రూ.7950 కోట్లు. ఈ థ్రిల్లర్ సినిమా మూడు ఓటీటీల్లో ఉంది. మ్యాక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో ఈ సినిమాను చూడొచ్చు.
జురాసిక్ వరల్డ్ రీబర్త్
మరోసారి డైనోసర్ల ప్రపంచాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన సినిమా జురాసిక్ వరల్డ్ రీబర్త్. జురాసిక్ వరల్డ్ లో భాగంగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా 868 మిలియన్ల డాలర్లు సంపాదించింది. ఇండియా కరెన్సీలో ఇది రూ.7210 కోట్లు. ఈ చిత్రం ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో ఉంది.
డీమాన్ స్లేయర్ ది మూవీ ఇన్ఫినిటీ కాస్టిల్
{{/usCountry}}మరోసారి డైనోసర్ల ప్రపంచాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన సినిమా జురాసిక్ వరల్డ్ రీబర్త్. జురాసిక్ వరల్డ్ లో భాగంగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా 868 మిలియన్ల డాలర్లు సంపాదించింది. ఇండియా కరెన్సీలో ఇది రూ.7210 కోట్లు. ఈ చిత్రం ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో ఉంది.
డీమాన్ స్లేయర్ ది మూవీ ఇన్ఫినిటీ కాస్టిల్
{{/usCountry}}జపనీస్ యానిమేటెడ్ మూవీ డీమాన్ స్లేయర్ ది మూవీ ఇన్ఫినిటీ కాస్టిల్. ఇది కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 740.4 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టింది. ఇది రూ.6145 కోట్లకు సమానం. ఇది త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రిలీజయ్యే అవకాశముంది.