...
...
Next Story

శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్ త్రికాల నుంచి యాలో ఈ గుబులే ఎలో సాంగ్ రిలీజ్- క్యాచి లిరిక్స్- మనసుకు హత్తుకునేలా గానం

బ్యూటిపుల్ శ్రద్ధా దాస్ మెయిన్ రోల్ పోషిస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమా త్రికాల. తాజాగా త్రికాల సినిమా నుంచి యాలో ఈ గుబులే ఎలో సాంగ్‌ను రిలీజ్ చేశారు. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.

Published on: Jan 3, 2026, 20:33:04 IST
Advertisement

అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న మ్యూజిక్ కంపోజర్ హర్షవర్దన్ రామేశ్వర్. ఇప్పుడు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న 'త్రికాల’ సినిమా మ్యూజిక్ అందిస్తున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్.

యాలో ఈ గుబులే ఎలో సాంగ్ రిలీజ్

శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్ త్రికాల నుంచి యాలో ఈ గుబులే ఎలో సాంగ్ రిలీజ్- క్యాచి లిరిక్స్- మనసుకు హత్తుకునేలా గానం
శ్రద్ధా దాస్ హారర్ థ్రిల్లర్ త్రికాల నుంచి యాలో ఈ గుబులే ఎలో సాంగ్ రిలీజ్- క్యాచి లిరిక్స్- మనసుకు హత్తుకునేలా గానం

త్రికాల సినిమాలో బ్యూటిఫుల్ శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న త్రికాల చిత్రం నుంచి తాజాగా యాలో ఈ గుబులే ఎలో పాటని రిలీజ్ చేశారు.

ప్రధాన బలంగా మ్యూజిక్

ఈ పాటలో హర్షవర్దన్ రామేశ్వర్ స్టైల్‌తో పాటు మెలోడీకి ఉన్న డెప్త్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. ఆయన మ్యూజిక్ ట్రీట్ ఈ పాటకి ప్రధాన బలం. ప్రతి బీట్‌లోనూ ఆయన ట్రేడ్‌మార్క్ ఇంటెన్సిటీ స్పష్టంగా వినిపిస్తూ, పాటకి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఇచ్చింది.

సూటిగా హృదయానికి చేరేలా

ఇక అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకి ప్రాణం పోసింది అని చెప్పాలి. భావోద్వేగాల్ని సూటిగా హృదయానికి చేరేలా, చెప్పగల ఆయన వాయిస్ (గానం), పాటలోని లవ్ ఫీలింగ్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. సాఫ్ట్ టచ్‌తో పాటు పవర్ ఉన్న వాయిస్ మాడ్యులేషన్‌తో అనురాగ్ మరోసారి తన వెర్సటిలిటీని నిరూపించాడు.

రాకేందు మౌళి క్యాచి లిరిక్స్

నటుడు, రైటర్ రాకేందు మౌళి లిరిక్స్ క్యాచిగా ఉన్నాయి. మొత్తానికి ‘యాలో ఈ గుబులే ఎలో’ పాట హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ బ్రిలియన్స్‌కి, అనురాగ్ కులకర్ణి ఎమోషనల్ సింగింగ్‌కి పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌గా నిలుస్తోంది. ‘త్రికాల’ సినిమా ఆల్బమ్‌పై అంచనాలను మరింత పెంచేలా ఈ పాట ప్రత్యేకంగా నిలిచింది. సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రాఫీ సాంగ్‌కి మరింత వైబ్ తీసుకొచ్చింది.

త్రికాల నటీనటులు

ఇప్పటికే రిలీజ్ చేసిన త్రికాల ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఒక్క ట్రైలర్‌తోనే ఏకంగా నార్త్ ఇండియాలోనూ ‘త్రికాల’ బిజినెస్ జరిగిపోయింది. ప్రస్తుతం అన్ని చోట్లా ‘త్రికాల’ మీద మంచి డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks