Toxic Runtime: కేజీఎఫ్ చాప్టర్ 2 క్రియేట్ చేసిన సునామీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 26న థియేటర్లలోకి గ్రాండ్‌గా వస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేయడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
194 నిమిషాల ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

ఈ మోస్ట్ వైలెంట్ గ్యాంగ్‌స్టర్ కథనంలో అడల్ట్ కంటెంట్, రఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉండటంతో సీబీఎఫ్‌సీ (CBFC) నుంచి 'A' సర్టిఫికెట్ లభించింది. అయితే ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ఇది అందరూ ఊహించినదే అయినా, అసలు సర్‌ప్రైజ్ ఏంటంటే ఈ సినిమా రన్‌టైమ్. దాదాపు 3 గంటల 14 నిమిషాలు (194 నిమిషాలు) సుదీర్ఘ నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ మధ్య కాలంలో వస్తున్న బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఇంత నిడివి ఉన్న చిత్రాలు అరుదుగా కనిపిస్తున్నాయి. స్క్రీన్‌ప్లే ఏమాత్రం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే తప్ప ఇంత భారీ రన్‌టైమ్ సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టడం చాలా కష్టం. అయితే డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ మాత్రం అలాంటి కంటెంట్ నే సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇండిపెండెన్స్ తర్వాత గోవా బ్యాక్‌డ్రాప్.. రాయగా యశ్ కంబ్యాక్
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి కాలంలో గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. క్రైమ్, పవర్, వైలెన్స్ చుట్టూ కథనం చాలా రా అండ్ రస్టిక్‌గా తిరుగుతుంది. ఇందులో యశ్ 'రాయ' (Raya) అనే పవర్‌ఫుల్, వింటేజ్ షేడ్స్ ఉన్న రోల్‌లో మెరవనున్నారు.
ఈ సినిమా కథను డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌తో కలిసి యశ్ స్వయంగా రాసుకోవడం విశేషం. కేజీఎఫ్ క్రియేట్ చేసిన ప్రభంజనం తర్వాత యశ్ చాలా టైమ్ తీసుకుని ఎంచుకున్న ప్రాజెక్ట్ కావడంతో బిజినెస్ వర్గాల్లో విపరీతమైన హైప్ నెలకొంది.
భారీ తారాగణం.. రికార్డు స్థాయి బడ్జెట్
{{/usCountry}}ఈ సినిమా కథను డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌తో కలిసి యశ్ స్వయంగా రాసుకోవడం విశేషం. కేజీఎఫ్ క్రియేట్ చేసిన ప్రభంజనం తర్వాత యశ్ చాలా టైమ్ తీసుకుని ఎంచుకున్న ప్రాజెక్ట్ కావడంతో బిజినెస్ వర్గాల్లో విపరీతమైన హైప్ నెలకొంది.
భారీ తారాగణం.. రికార్డు స్థాయి బడ్జెట్
{{/usCountry}}కేవలం హీరో క్యారెక్టర్ మాత్రమే కాకుండా పాన్-ఇండియా రేంజ్‌లో చాలా పెద్ద తారాగణాన్నే ఈ సినిమా కోసం దింపారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. ప్రతీ క్యారెక్టర్‌కి కథలో బలమైన ఎమోషన్, ప్రాముఖ్యత ఉన్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్పష్టమైంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కే నారాయణతో కలిసి యశ్ స్వయంగా మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.