...
...
Next Story

Yash: నేను ఎవరికీ వినే రకం కాదు.. వాళ్లే స్టూపిడ్స్.. టాక్సిక్ మామూలు సినిమా కాదు.. ఇది యూనిక్: యశ్

Yash: టాక్సిక్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ నే కాదు టోటల్ వరల్డ్ వైడ్ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు యశ్. అతని అప్ కమింగ్ మూవీ టాక్సిక్ ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా యశ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Aug 8, 2026, 21:58:51 IST
Advertisement

Yash: కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో రాకింగ్ స్టార్ యశ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటివరకూ కేవలం కన్నడ పరిశ్రమలోనే హీరోగా తెలిసిన యశ్.. కేజీఎఫ్ సినిమాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే నటుడిగా మారాడు. అలాంటి కేజీఎఫ్ తర్వాత, భారీ అంచనాల నడుమ యశ్ చేస్తున్న సినిమా ‘టాక్సిక్’. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా యశ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

యశ్ కామెంట్లు

నేను ఎవరికీ వినే రకం కాదు.. వాళ్లే స్టూపిడ్స్.. టాక్సిక్ మామూలు సినిమా కాదు.. ఇది యూనిక్: యశ్
నేను ఎవరికీ వినే రకం కాదు.. వాళ్లే స్టూపిడ్స్.. టాక్సిక్ మామూలు సినిమా కాదు.. ఇది యూనిక్: యశ్

టాక్సిక్ ట్రైలర్ ను శనివారం (ఆగస్టు 8) రిలీజ్ చేశారు. బెంగళూరులో ఈ ఈవెంట్ జరిగింది. ట్రైలర్ లాంఛ్ సందర్భంగా యశ్ మాట్లాడాడు. తాను ఎవరికీ వినే రకం కాదని యశ్ స్పష్టం చేశాడు. ఇంపాజిల్ అనే విషయాన్ని చేసి చూపించడం తనకు అలవాటని పేర్కొన్నాడు.

ఎవరి మాట వినను

‘‘లైఫ్ లో ఏదైనా చేయాలని గట్టిగా ఫిక్స్ అయితే ఏదీ మనల్ని ఆపదు. నేను ఇదే విషయాన్ని నమ్ముతా. చెడ్డ విషయాలు చెప్పే మాటలను చాలా మంది వింటుంటారు. మనం ఏం చేయలేమని చెప్పేవాళ్లు ఎంతో మంది ఉంటారు. నేను ఎవరికీ వినే రకం కాదు. ఎవరైనా నేను ఏదైనా చేయలేను అని చెప్తే చేసి చూపిస్తా’’ అని యశ్ చెప్పాడు.

ఇటి టఫ్ సినిమా

‘‘ఏదైనా చేయలేవు అని చెప్పారనుకో. వాళ్ల ఇమాజినేషన్ అంతే అని వదిలేస్తా. అది వాళ్ల మూర్ఖత్వం అని అనుకుంటా. నువ్వు గోల్ సెట్ చేసుకుని కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ఈ మూవీ (టాక్సిక్) చాలా టఫ్ సినిమా. ఇదంత ఈజీ కాదు. కమర్షియల్ ప్యాకేజీ ఫిల్మ్ కాదు’’ అని యశ్ తెలిపాడు.

ఇది యూనిక్ మూవీ

టాక్సిక్ ట్రైలర్

ఇవాళ రిలీజైన టాక్సిక్ ట్రైలర్ వైలెన్స్ ప్లస్ రొమాన్స్ తో నిండి ఉంది. విజువల్స్ అయితే వేరే లెవల్ లో ఉన్నాయి. ఇందులో యశ్ డ్యుయల్ రోల్ ప్లే చేశాడు. తండ్రి రాయ, కొడుకు టికెట్ గా యశ్ నటించాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. టాక్సిక్ మూవీ ఆగస్టు 26న రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks