...
...
Next Story

Yash Toxic: టాక్సిక్ డిజాస్టర్.. నెగటివ్ రివ్యూలు, బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌పై యశ్ తొలి రియాక్షన్ ఇలా.. వాళ్ల ఇష్టం అంటూ..

Yash Toxic: టాక్సిక్ మూవీ డిజాస్టర్ గా నిలిచిపోయిన తర్వాత యశ్ రియాక్షన్ ఏంటన్నది ఇప్పటి వరకూ బయటకు రాలేదు. అయితే ఈ మూవీలో ఓ భాగమైన జైదేవ్ మోహన్ మూవీ ఫెయిల్యూర్ పై యశ్ ఏమన్నాడో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Published on: Sep 9, 2026, 14:01:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Yash Toxic: 'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ని ఏలిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) మూవీ డిజాస్టర్ అవ్వడంపై ఎట్టకేలకు మొదటిసారి స్పందించారు. 4 ఏళ్ల పాటు పగలు రాత్రి కష్టపడి చేసిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురైన యశ్.. తన టీమ్‌ సభ్యుడితో ఫోన్ సంభాషణలో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

“ఎక్కువ బాధపడొద్దు.. ప్రేక్షకుల ఇష్టం”

Yash Toxic: టాక్సిక్ డిజాస్టర్.. నెగటివ్ రివ్యూలు, బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌పై యశ్ తొలి రియాక్షన్ ఇలా.. వాళ్ల ఇష్టం అంటూ..
Yash Toxic: టాక్సిక్ డిజాస్టర్.. నెగటివ్ రివ్యూలు, బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌పై యశ్ తొలి రియాక్షన్ ఇలా.. వాళ్ల ఇష్టం అంటూ..

టాక్సిక్ సినిమా డబ్బింగ్ సూపర్‌వైజర్‌గా వ్యవహరించిన జైదేవ్ మోహన్ రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజాలను బయటపెట్టారు. టాక్సిక్ సినిమా ఫ్లాప్ అయిందనే వార్తలు రాగానే తాను చాలా ఎమోషనల్ అయ్యానని, అయితే యశ్ స్వయంగా ఫోన్ చేసి తనను ఓదార్చారని తెలిపారు.

"సినిమా రిలీజ్ రోజే నెగెటివ్ రివ్యూలు చూసి నేను బాగా డిస్టర్బ్ అయ్యాను. కానీ యశ్ నాకు ఫోన్ చేసి 'ఎక్కువ బాధపడొద్దు జైదేవ్.. ఫలితాన్ని కోరుకున్నట్లు ప్రేక్షకులే నిర్ణయిస్తారు. అది వాళ్ల ఇష్టం. మనం తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి' అని చెప్పారు. కానీ ఆయన మాటల్లో ఉన్న బాధ నాకు స్పష్టంగా అనిపించింది" అని జైదేవ్ వెల్లడించారు.

3 లక్షలకు పైగా పైరసీ లింక్స్ డిలీట్..

నాలుగేళ్ల క్రితం ఒక చిన్న బీజంగా మొదలైన కథ సినిమాగా మారే క్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయని, అయితే ఆడియన్స్‌కి నచ్చకపోతే మనం ఏమీ చేయలేమని జైదేవ్ ఒప్పుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతినడానికి పైరసీ కూడా ఒక ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. సినిమా రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 3 లక్షలకు పైగా పైరసీ లింక్స్‌ను డిలీట్ చేయించినట్లు చెప్పారు.

'కేజీఎఫ్ చాప్టర్ 2' తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకుని యశ్ నటించిన సినిమా కావడంతో 'టాక్సిక్'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి పాన్ ఇండియా స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ, కంటెంట్ లో ఉన్న సంక్లిష్టత వల్ల సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.

రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 338.50 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టి భారీ నష్టాలను మిగిల్చింది. ఏదేమైనా ఈ ఓటమితో నిరాశపడకుండా రాకింగ్ స్టార్ యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks