Yash Toxic 4 Days Worldwide Collection: 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
రూ. 250 కోట్ల కలెక్షన్స్‌తో టాక్సిక్

భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ఈ టాక్సిక్ చిత్రం నాలుగో రోజు (ఆగస్టు 29) నాటికి రూ. 250 కోట్ల క్లబ్‌లో చేరి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా యశ్‌కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్‌తో 'టాక్సిక్' చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.
పక్కా ప్లానింగ్‌తో రికార్డు స్థాయి ఓపెనింగ్స్!
మిక్స్‌డ్ రివ్యూలు, నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్ల వద్ద ప్రేక్షకుల హడావుడి తగ్గకపోవడమే ఈ భారీ వసూళ్లకు ప్రధాన కారణం. తొలి రోజే భారతదేశ వ్యాప్తంగా రూ. 101.10 కోట్ల నెట్ సాధించిన ఈ టాక్సిక్ సినిమా ఇటీవల వచ్చిన 'ధురంధర్ పార్ట్ 1' కలెక్షన్ల రికార్డులను దాటేసింది.
ఇండియాలో టాక్సిక్ మూవీకి తొలి రోజు గ్రాస్ రూ. 120.75 కోట్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 20 కోట్లు వచ్చాయి. దీంతో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140.75 కోట్ల గ్రాస్ నమోదు చేసి యశ్ గ్లోబల్ రేంజ్‌ను చాటిచెప్పారు.
రెండో రోజున దేశీయంగా రూ. 37.65 కోట్ల నెట్, మూడో రోజు రూ. 27.20 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. మూడో రోజు నాటికే దేశీయంగా రూ. 165.95 కోట్ల నెట్ (గ్రాస్ రూ. 198.10 కోట్లు) సాధించి బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టు సాధించింది టాక్సిక్ మూవీ.
నాలుగో రోజు భాషల వారీగా వసూళ్లు ఎంతంటే?
ట్రేడ్ వర్గాలు అందించిన గణాంకాల ప్రకారం, నాలుగో రోజు టాక్సిక్ చిత్రం భారతదేశంలో రూ. 24.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో దేశీయంగా మొత్తం 4రోజుల నెట్ వసూళ్లు రూ. 190.45 కోట్లకు (గ్రాస్ రూ. 227.50 కోట్లు) చేరుకున్నాయి.
{{/usCountry}}ట్రేడ్ వర్గాలు అందించిన గణాంకాల ప్రకారం, నాలుగో రోజు టాక్సిక్ చిత్రం భారతదేశంలో రూ. 24.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో దేశీయంగా మొత్తం 4రోజుల నెట్ వసూళ్లు రూ. 190.45 కోట్లకు (గ్రాస్ రూ. 227.50 కోట్లు) చేరుకున్నాయి.
{{/usCountry}}భాషల వారీగా చూస్తే, నాలుగో రోజు హిందీ బెల్ట్‌లో రూ. 15.50 కోట్లు, మాతృభాష కన్నడలో రూ. 6.60 కోట్లు వచ్చాయి. తెలుగులో రూ. 1.50 కోట్లు, తమిళంలో రూ. 75 లక్షలు, మలయాళంలో రూ. 15 లక్షలు నమోదు అయ్యాయి.
రూ. 250 కోట్ల మైలురాయి దాటిన 'టాక్సిక్'
ఓవర్సీస్ మార్కెట్‌లో నాలుగో రోజు మరో రూ. 4 కోట్లు రావడంతో, విదేశీ మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 27.25 కోట్లకు చేరాయి. ఫలితంగా 'టాక్సిక్' సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 254.75 కోట్ల భారి గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
టాక్ అటుఇటుగా ఉన్నా మాస్ ఆడియన్స్ ఆదరణతో మొదటి వీకెండ్ బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ జాతర సాగింది. రాబోయే వర్కింగ్ డేస్‌లో ఇదే ఊపు కొనసాగిస్తే లాంగ్ రన్‌లో ఈ యశ్ సినిమా టాక్సిక్ మరిన్ని రికార్డులను నెలకొల్పడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.