Toxic Song: కేజీఎఫ్ 2 సృష్టించిన సునామీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా ప్రకటించిన చిత్రం 'టాక్సిక్'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్‌మేకర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి పాట 'తబాహి' (Tabaahi) చార్ట్‌బస్టర్‌గా నిలవగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ 'మనసాగదే' ను ఐదు భాషల్లో విడుదల చేశారు.
రాయా - రెబెక్కా రొమాన్స్

టాక్సిక్ నుంచి రిలీజైన రెండో పాట ‘మనసాగదే’ లో యష్ (రాయా క్యారెక్టర్), తార సుతారియా (రెబెక్కా క్యారెక్టర్)ల మధ్య సాగే సున్నితమైన ప్రేమ భావాలు, సరదా అనుబంధం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌కు భిన్నంగా యాష్ ఇందులో కేర్‌ఫ్రీ రొమాంటిక్ అవతార్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తోంది.
తగ్గేదేలే
టాక్సిక్ మూవీ గ్లింప్స్, తబాహి సాంగ్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కానీ యష్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. తబాహి సాంగ్ లో కియారా అద్వానీతో యశ్ బోల్డ్ కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మనసాగదే సాంగ్ లో తార సుతారియాతో యష్ రొమాన్స్ వైరల్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ తార సుతారియా (Tara Sutaria) ఈ పాటకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది.
తనిష్క్ బాగ్చి, అర్సలాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా కలిసి స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీని ఐదు భాషల్లోనూ ప్రముఖ గాయకుడు సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించాడు. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, కంటికింపుగా ఉండే కలర్ ప్యాలెట్ పాటను విజువల్ వండర్‌గా మార్చాయి. రామజోయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.
సిగరెట్ తో నయనతార
మనసాగదే పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. బాధలో ఉన్న యష్ ను వచ్చి చేయి పట్టుకునే నయనతార.. యష్ తాగిన సిగరెట్ ను షేర్ చేసుకుంటుంది. దీంతో అసలు ఈ టాక్సిక్ మూవీలో నయనతార క్యారెక్టర్ ఏంటీ అనేది మరింత సస్పెన్స్ గా మారింది.
గీతూ మోహన్‌దాస్ బిగ్ ప్లాన్!
{{/usCountry}}మనసాగదే పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. బాధలో ఉన్న యష్ ను వచ్చి చేయి పట్టుకునే నయనతార.. యష్ తాగిన సిగరెట్ ను షేర్ చేసుకుంటుంది. దీంతో అసలు ఈ టాక్సిక్ మూవీలో నయనతార క్యారెక్టర్ ఏంటీ అనేది మరింత సస్పెన్స్ గా మారింది.
గీతూ మోహన్‌దాస్ బిగ్ ప్లాన్!
{{/usCountry}}'టాక్సిక్' సినిమాలో సౌత్, నార్త్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ లైన్‌అప్ హీరోయిన్లు నటిస్తుండటం సినిమా మేకింగ్ స్కేల్‌ను తెలియజేస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ (Kiara Advani), తార సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి ప్రతిభావంతులైన నటీమణులు కథను మలుపు తిప్పే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ప్రతి ఒక్కరి పాత్రకూ కథాగమనంలో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల కానున్న టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది.