...
...
Next Story

Yesha Nagula Song: ది ప్యారడైజ్ నుంచి ఏష నాగుల కట్ట మీద సాంగ్ రిలీజ్.. అమెరికా స్టేజీపై అనిరుధ్‌తో నాని మాస్ డ్యాన్స్

Nani The Paradise Yesha Nagula Song Released: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాబోలో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి 'ఏష నాగుల కట్ట మీద'ను అమెరికాలోని డల్లాస్ కాన్సర్ట్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజీపైకి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన నాని.. అనిరుధ్‌తో కలిసి మాస్ డ్యాన్స్ వేసి అలరించాడు.

Published on: Aug 29, 2026, 12:52:10 IST
Advertisement

Nani The Paradise Yesha Nagula Song Released: 'దసరా' వంటి భారీ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాపై టాలీవుడ్‌లో మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి.

ఏష నాగుల కట్ట మీద సాంగ్ రిలీజ్

ది ప్యారడైజ్ నుంచి ఏష నాగుల కట్ట మీద సాంగ్ రిలీజ్.. అమెరికా స్టేజీపై అనిరుధ్‌తో నాని మాస్ డ్యాన్స్
ది ప్యారడైజ్ నుంచి ఏష నాగుల కట్ట మీద సాంగ్ రిలీజ్.. అమెరికా స్టేజీపై అనిరుధ్‌తో నాని మాస్ డ్యాన్స్

తాజాగా ది ప్యారడైజ్ సినిమా నుంచి రెండో సింగిల్ 'ఏష నాగుల కట్ట మీద' పాటను మేకర్స్ విడుదల చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఏష నాగుల కట్ట మీద సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

డల్లాస్ వేదికగా అనిరుధ్, నాని మాస్ హంగామా

అనిరుధ్ కాన్సర్ట్ జరుగుతున్న సమయంలో నాని ఊహించని విధంగా వేదికపైకి వచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ పాటను అనిరుధ్ పాడుతుండగా నాని ఆయనతో కలిసి చేసిన మాస్ డాన్స్ ఆడిటోరియాన్ని ఊపేసింది. నాని తన సినిమాలో నటించే 'జడల్' పాత్ర లుక్‌లోనే పొడవాటి జుట్టు, వెనుక వైపు రెక్కల డిజైన్ ఉన్న స్పెషల్ బ్లాక్ జాకెట్ ధరించి కనిపించారు.

ప్యారడైజ్ డైలాగ్‌తో నాని

అంతేకాకుండా ఆ ఈవెంట్‌లో పాల్గొన్న అందరికి దిష్టి తీయాలని ప్యారడైజ్ సినిమాలోని డైలాగ్‌ను అందరితో చెప్పించారు నాని. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 'ఏష నాగుల కట్ట మీద' పాట ప్రస్తుతం స్పొటిఫై ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉందని, త్వరలోనే యూట్యూబ్‌లో అధికారిక లిరికల్ వీడియోను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

మరోసారి కలిసిన 'దసరా' కాంబో.. కీర్తి సురేష్ క్యామియో!

"వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది" అని కీర్తి సురేష్.. హీరో నానితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి "మనం ఊగుదమే బాలా" అని నాని సమాధానమిచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య సాగిన ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అణచివేతపై తిరుగుబాటు.. భారీ తారాగణంతో 'ది ప్యారడైజ్'

ఇదిలా ఉంటే ది ప్యారడైజ్ సినిమాలో సొంత నేల, తన ప్రజల హక్కుల కోసం అణచివేతదారులపై పోరాడే 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో నాని నటిస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ రిలీజ్

ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కయాదు లోహర్, తనికళ్ల భరణి, సోనాలీ కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న 'ది ప్యారడైజ్' చిత్రం 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో థియేటర్లలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe