...
...
Next Story

OTT Romantic: నెట్‌ఫ్లిక్స్‌‌లోని ముసాఫిర్ కేఫే నచ్చిందా? ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ 7 రొమాంటిక్ డ్రామాస్ మిస్ కాకుండా చూడండి

OTT Romantic: నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ వెబ్ సిరీస్ ముసాఫిర్ కేఫే నచ్చిందా? అయితే ఇప్పటికే ఓటీటీలో ఉన్న ఈ టాప్ 7 రొమాంటిక్ సిరీస్ మిస్ కాకుండా చూడండి. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇవి ఉన్నాయి.

Published on: Aug 6, 2026, 14:16:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Romantic: నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న 'ముసాఫిర్ కేఫే' వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ నంబర్ 1 పొజిషన్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ రచయిత దివ్య ప్రకాష్ దూబే రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్.. సుధా, చందర్, ప్రీతి అనే ముగ్గురు వ్యక్తుల లైఫ్‌లోని లవ్ అండ్ ఎమోషన్స్‌ను బ్యూటీఫుల్‌గా ఆవిష్కరించింది.

OTT Romantic: నెట్‌ఫ్లిక్స్‌‌లోని ముసాఫిర్ కేఫే నచ్చిందా? ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ 7 రొమాంటిక్ డ్రామాస్ మిస్ కాకుండా చూడండి
OTT Romantic: నెట్‌ఫ్లిక్స్‌‌లోని ముసాఫిర్ కేఫే నచ్చిందా? ఓటీటీల్లో ఉన్న ఈ టాప్ 7 రొమాంటిక్ డ్రామాస్ మిస్ కాకుండా చూడండి

వెబ్ సిరీస్ అందించిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్మెంట్ మీకు బాగా నచ్చితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అస్సలు మిస్ కాకూడని 7 బెస్ట్ రొమాంటిక్ డ్రామా సిరీస్‌ల లిస్ట్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.

టాప్ 7 రొమాంటిక్ వెబ్ సిరీస్

1. తాజ్ మహల్ 1989 | నెట్‌ఫ్లిక్స్ | IMDb: 7.4

2. మోడర్న్ లవ్ ముంబై | ప్రైమ్ వీడియో | IMDb: 7.6

3. బ్రోకెన్ బట్ బ్యూటీఫుల్ | ప్రైమ్ వీడియో/ జీ5 | IMDb: 8.5

4. మిస్‌మ్యాచ్డ్ | నెట్‌ఫ్లిక్స్ | IMDb: 6.0

5. బారిష్ | జియోహాట్‌స్టార్ | IMDb: 7.8

6. ఎ సూటబుల్ బాయ్ | నెట్‌ఫ్లిక్స్ | IMDb: 6.2

7. లిటిల్ థింగ్స్ | నెట్‌ఫ్లిక్స్ | IMDb: 8.2

1. తాజ్ మహల్ 1989 (నెట్‌ఫ్లిక్స్)

1989 నాటి లక్నో బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ వెబ్ సిరీస్ వివిధ వయస్సుల వ్యక్తుల మధ్య ఉండే ప్రేమను, బంధాలను అద్భుతంగా చూపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ డ్రామాలో నీరజ్ కాబీ, గీతాంజలి కులకర్ణి, షీబా చద్దా ప్రధాన పాత్రల్లో నటించగా దీనికి ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది.

2. మోడర్న్ లవ్ ముంబై (ప్రైమ్ వీడియో)

ప్రేమలో విఫలమై, గుండె పగిలిన ఇద్దరు వ్యక్తులు మళ్లీ ఎలా దగ్గరయ్యారనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మోస్ట్ ఎమోషనల్ వెబ్ సిరీస్ ఇది. ప్రైమ్ వీడియో, జీ5 ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఈ డ్రామా 8.5 ఐఎండీబీ రేటింగ్‌తో ఆడియన్స్ నుంచి విపరీతమైన ప్రేమను దక్కించుకుంది.

4. మిస్‌మ్యాచ్డ్ (నెట్‌ఫ్లిక్స్)

కాలేజ్ బ్యాక్‌డ్రాప్, ఫ్రెండ్‌షిప్, యంగ్ లవ్ కోరుకునే వారికి 'మిస్‌మ్యాచ్డ్' పర్ఫెక్ట్ ఛాయిస్. డింపుల్, రిషి అనే ఇద్దరు యూత్ మధ్య సాగే ఈ రొమాంటిక్ జర్నీ నెట్‌ఫ్లిక్స్‌లో 3 సీజన్లుగా సూపర్ హిట్ అయింది. త్వరలోనే 4వ సీజన్ కూడా రాబోతోంది.

5. బారిష్ (జియోహాట్‌స్టార్)

పూర్తిగా భిన్నమైన నేపథ్యాలు ఉన్న గౌరవి, అనుజ్ అనే ఇద్దరు వ్యక్తుల అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీగా 'బారిష్' రూపొందింది. శర్మన్ జోషి, ఆశా నేగి లీడ్ రోల్స్ చేసిన ఈ క్యూట్ రొమాంటిక్ డ్రామా జియోహాట్‌స్టార్‌లో లభిస్తోంది. దీని ఐఎండీబీ రేటింగ్ 7.8.

6. ఏ సూటబుల్ బాయ్ (నెట్‌ఫ్లిక్స్)

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఇండియాలో జరిగిన సామాజిక మార్పులు, ఇద్దరు ప్రేమికుల కథ ఆధారంగా ఈ పీరియాడిక్ డ్రామాను రూపొందించారు. ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ 1993లో రాసిన నవల ఆధారంగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

7. లిటిల్ థింగ్స్ (నెట్‌ఫ్లిక్స్)

ధ్రువ్, కావ్య అనే యంగ్ కపుల్ మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, ప్రేమ, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ నుంచి నిశ్చితార్థం వరకు సాగే ప్రయాణమే ఈ వెబ్ సిరీస్. మొత్తం 4 సీజన్లుగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా 8.2 ఐఎండీబీ రేటింగ్‌తో నెట్‌ఫ్లిక్స్ ఆడియన్స్‌కు ఆల్-టైమ్ ఫేవరెట్‌గా నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe