...
...
Next Story

Youth OTT: ముగ్గురు అమ్మాయిలతో టీనేజీ కుర్రాడి లవ్.. ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Youth OTT: ఓటీటీలోకి మరో తమిళ సూపర్ హిట్ సినిమా రాబోతుంది. టీనేజీ లవ్ నేపథ్యంలో తీసిన ‘యూత్’ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తెలుగులోనూ ఓటీటీ డెబ్యూకు రెడీ అవుతోంది.

Published on: Apr 11, 2026, 16:56:48 IST
Advertisement

టీనేజీ ఫ్రెండ్ షిప్, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘యూత్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ యూత్ ఫుల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఇందులో హీరోగా నటించిన కెన్ కరుణాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

యూత్ ఓటీటీ

ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ మూవీ (x/KenKarunaas)
ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ మూవీ (x/KenKarunaas)

తమిళ టీనేజీ లవ్ స్టోరీ మూవీ ‘యూత్’ ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 16 నుంచి టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇవాళ (ఏప్రిల్ 11) నెట్‌ఫ్లిక్స్‌ సోషల్ మీడియాలో అనౌన్స్ మెంట్ పోస్టు పెట్టింది.

తెలుగులో కూడా

యూత్ సినిమా తెలుగు ఆడియన్స్ ను కూడా ఎంటర్ టైన్ చేసేందుకు తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో రిలీజ్ కానుంది. మన తెలుగు ఓటీటీ లవర్స్ కూడా యూత్ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.

సూపర్ హిట్

కెన్ కరుణాస్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన యూత్ మూవీ సూర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం మార్చి 19న తమిళ్ లో రిలీజైంది. అక్కడ పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమా తెలుగు వర్షన్ ను మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కెన్ కరుణాస్, అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేశ్ తదితరులు నటించారు.

యూత్ మూవీ స్టోరీ

ప్రవీణ్ మాత్రం స్కూల్ లైఫ్ కంప్లీట్ అయ్యేలోపు ఒక్కరినైనా ప్రేమించాలని టార్గెట్ గా పెట్టుకుంటాడు. కానీ అతని జీవితంలోకి గంగవల్లి (అనీషా), ప్రేషిక (మీనాక్షి), సోనాల్ (ప్రియాన్షి) వస్తారు. ప్రవీణ్ కు ప్రేషిక, సోనాల్ బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత గంగవల్లితో లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరోవైపు అతని ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? చివరకు ఏం జరిగింది? అన్నది యూత్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe