Today OTT: ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ.. టీనేజీ లవ్
Today OTT: ఇవాళ ఓటీటీలోకి ఓ బ్లాక్ బస్టర్ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చేసింది. టీనేజీ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కథ చుట్టూ తిరిగే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.
Today OTT: ఓటీటీల యూజ్ ఎక్కువయ్యాక వేర్వేరు భాషల్లోని డిఫరెంట్ కంటెంట్ ను తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలనూ తెగ చూసేస్తున్నారు. ఇవాళ తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే.. ‘యూత్’ మూవీ. ఇది టీనేజీ లవ్ చుట్టూ తిరిగే మూవీ.

యూత్ ఓటీటీ
లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘యూత్’ ఓటీటీలో రిలీజైంది. ఈ రోజు (ఏప్రిల్ 16) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేసింది.
బ్లాక్ బస్టర్
యూత్ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో కెన్ కరుణాస్ హీరో. ఈ మూవీకి డైరెక్టర్ కూడా అతనే. ఇంకా ఇందులో అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేశ్ హీరోయిన్లుగా నటించారు.
యూత్ మూవీ స్టోరీ
ఒక అమ్మాయినైనా ప్రేమించాలనుకునే టీనేజర్ లైఫ్ లోకి ముగ్గురు అమ్మాయిలు వస్తే ఏం జరిగిందనే కథతో తెరకెక్కిన సినిమానే యూత్. ఇందులో టీనేజర్ ప్రవీణ్ క్యారెక్టర్లో హీరో కెన్ కరుణాస్ నటించాడు. అతనిదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. స్కూల్ లో బాగా అల్లరి చేస్తుంటాడు. దీంతో అతనంటే మొదట్లో అమ్మాయిలకు పెద్దగా నచ్చదు.
ముగ్గురు అమ్మాయిలు
ప్రవీణ్ మాత్రం స్కూల్ లైఫ్ కంప్లీట్ అయ్యేలోపు ఒక్కరినైనా ప్రేమించాలని టార్గెట్ గా పెట్టుకుంటాడు. కానీ అతని జీవితంలోకి గంగవల్లి (అనీషా), ప్రేషిక (మీనాక్షి), సోనాల్ (ప్రియాన్షి) వస్తారు. ప్రవీణ్ కు ప్రేషిక, సోనాల్ బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత గంగవల్లితో లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరోవైపు అతని ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? చివరకు ఏం జరిగింది? అన్నది యూత్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
యూత్ కు నచ్చే మూవీ
యూత్ సినిమాను ముఖ్యంగా టేనేజీ కుర్రాళ్లు, యూత్ ను టార్గెట్ చేస్తూ తీశారు. పాఠశాల, కాలేజీ రోజుల్లో టీనేజీ కుర్రాళ్ల అల్లరి, ఆకర్షణలను ప్రధాన కథగా తీసుకున్నారు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్ ను కూడా యాడ్ చేశారు. అన్ని ఎలిమెంట్స్ పక్కా కుదరడంతో తమిళంలో యూత్ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటేందుకు వచ్చేసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


