Dhanashree Tollywood Debut: ప్రముఖ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా సెన్సేషన్, టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తెలుగు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో, మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా నటిస్తున్న 'హే కన్నమ్మ' సినిమాతో ధనశ్రీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
హీరోయిన్‌గా ధనశ్రీ వర్మ గ్రాండ్ ఎంట్రీ

సోషల్ మీడియాలో తనదైన డ్యాన్స్ వీడియోలతో, రీల్స్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ధనశ్రీ వర్మ.. ఇప్పుడు నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య అయిన ధనశ్రీకి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అద్భుతమైన డ్యాన్సర్ అయిన ఆమె, తొలిసారిగా పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలో నటించడం కోసం తెలుగు సినిమాను ఎంచుకోవడం విశేషం.
హీరోగా యష్ మాస్టర్.. దిల్ రాజు అండ
హే కన్నమ్మ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన హోమ్ బ్యానర్ 'దిల్ రాజు ప్రొడక్షన్స్' పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో బుల్లితెర డ్యాన్స్ షోల ద్వారా పాపులర్ అయిన యష్ మాస్టర్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. డ్యాన్స్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ఇద్దరూ డ్యాన్సర్లు ప్రధాన పాత్రల్లో నటించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ ప్రాజెక్టును దర్శకుడు శ్రీ శశికుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత అండ ఉండటంతో సినిమా క్వాలిటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
'ఆకాశం దాటి వస్తావా' నుంచి
నిజానికి ఈ సినిమాను ముందుగా 'ఆకాశం దాటి వస్తావా' అనే టైటిల్ తో ప్రకటించారు. అయితే సినిమా కంటెంట్, మ్యూజిక్ కు మరింత కనెక్ట్ అయ్యేలా మేకర్స్ తాజాగా ఈ టైటిల్ ను 'హే కన్నమ్మ' (Hey Kannamma) గా అఫీషియల్ గా మార్చారు. ఇదే విషయమై అప్డేట్ ఇస్తూ, 2026 నవంబర్ 27న సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ధనశ్రీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
{{/usCountry}}నిజానికి ఈ సినిమాను ముందుగా 'ఆకాశం దాటి వస్తావా' అనే టైటిల్ తో ప్రకటించారు. అయితే సినిమా కంటెంట్, మ్యూజిక్ కు మరింత కనెక్ట్ అయ్యేలా మేకర్స్ తాజాగా ఈ టైటిల్ ను 'హే కన్నమ్మ' (Hey Kannamma) గా అఫీషియల్ గా మార్చారు. ఇదే విషయమై అప్డేట్ ఇస్తూ, 2026 నవంబర్ 27న సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ధనశ్రీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
{{/usCountry}}ధనశ్రీ టాలీవుడ్ ఎంట్రీ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదొక అద్భుతమైన లవ్ అండ్ మ్యూజికల్ స్టోరీ అని ఇండస్ట్రీ వర్గాల టాక్. యష్ మాస్టర్, ధనశ్రీ వర్మ మధ్య కెమిస్ట్రీ తెరపై చాలా ఫ్రెష్ గా, యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉండబోతోందని సమాచారం. మరి హీరోయిన్ గా తన డెబ్యూ సినిమాతో ఈ డ్యాన్సింగ్ క్వీన్ తెలుగు ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.