Web Series: 60 ఎపిసోడ్ల మెగా తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తొలి 5 ఎపిసోడ్లు వచ్చేది రేపే..

Web Series: జీ5 ఓటీటీలోకి ఓ మెగా తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఏకంగా 60 ఎపిసోడ్లతో రానున్న ఈ సిరీస్ తొలి ఐదు ఎపిసోడ్లను రేపటి నుంచి అంటే జులై 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

Published on: Jul 2, 2026, 20:08:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Web Series: ఓటీటీ ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ తెలుగు ఒరిజినల్ మెగా వెబ్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' (Veerabhadruni Rahasyam) గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 తెలుగు (ZEE5 Telugu) ఈ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్‌కు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. జులై 3న (రేపు) ఈ క్రేజీ సిరీస్‌లోని మొదటి 5 ఎపిసోడ్స్ ఒకేసారి స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి.

Web Series: 60 ఎపిసోడ్ల మెగా తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తొలి 5 ఎపిసోడ్లు వచ్చేది రేపే..
Web Series: 60 ఎపిసోడ్ల మెగా తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తొలి 5 ఎపిసోడ్లు వచ్చేది రేపే..

ప్రస్తుతం డిజిటల్ స్క్రీన్స్ పై మైథలాజికల్ టచ్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్స్, మిస్టరీ డ్రామాలకు ఓ రేంజ్ డిమాండ్ నడుస్తోంది. ఆ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తూ జీ5 సంస్థ అత్యంత భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ మెగా ఒరిజినల్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసింది.

మర్మదేశం బ్యాక్‌డ్రాప్‌లో మైండ్ బెండింగ్ థ్రిల్లర్

1990ల్లో వచ్చిన మర్మదేశం టీవీ సిరీస్ గుర్తుంది కదా. అదే బ్యాక్‌డ్రాప్ లో ఈ వీరభద్రుని రహస్యం వెబ్ సిరీస్ కూడా తెరకెక్కించారు. ఒక పురాతన ఆలయం, ఆ ఊరి చుట్టూ ఉన్న గిరిజన తెగలు, దశాబ్దాలుగా దాగున్న ఒక పవర్‌ఫుల్ వీరభద్రుడి రహస్యం చుట్టూ ఈ కథ మొత్తం తిరగబోతోంది. మొత్తంగా 60 ఎపిసోడ్లతో ఈ సిరీస్ రానున్నా.. తొలి 5 ఎపిసోడ్లను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.

“రేపే ప్రీమియర్.. తెలుగు జీ5 ఒరిజినల్ మెగా వెబ్ సిరీస్ వీరభద్రుని రహస్యం తొలి 5 ఎపిసోడ్లు రేపే.. చూస్తూనే ఉండండి” అనే క్యాప్షన్ తో ఓ సరికొత్త పోస్టర్ ను జీ5 ఓటీటీ షేర్ చేసింది.

60 ఎపిసోడ్లతో మ్యాజిక్

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ 8 లేదా 10 ఎపిసోడ్ల లిమిటెడ్ సిరీస్‌ల వైపు మొగ్గు చూపుతుంటే, జీ5 మాత్రం టెలివిజన్ హిస్టరీలోనే ఒకప్పటి కల్ట్ క్లాసిక్ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ 60 ఎపిసోడ్ల భారీ ప్రాజెక్ట్‌ను లైన్లోకి తెచ్చింది.

ఒకప్పుడు బుల్లితెరపై మిస్టరీ, సస్పెన్స్, డివోషనల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన మర్మదేశం సిరీస్ గుర్తుందా? ఆ టీమ్ నుంచే ఇప్పుడీ వీరభద్రుని రహస్యం రాబోతోంది. అప్పట్లో జనాలను టీవీలకు కట్టేసే అదే వైబ్‌ను, అదే ఇంటెన్సిటీని మళ్లీ తీసుకొస్తూ హై క్వాలిటీ మేకింగ్‌తో ఈ వెబ్ సిరీస్‌ను డిజైన్ చేశారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో చూస్తుంటేనే అర్ధమవుతోంది.. ఇందులో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. మర్మదేశం మళ్లీ మొదలైంది అనే లైన్స్ తో ఈ ప్రోమో ప్రారంభమైంది. ఒక తరాన్ని భయపెట్టిన కథ.. ఈ తరానికి పరిచయం లేని కథ అనే టెక్ట్స్ తర్వాత వస్తుంది.

“కనకాన్ని అతిగా మోహించిన వేళ.. కాంతను అతిగా కామించిన వేళ.. కీర్తిని అతిగా కాంక్షించిన వేళ.. కలి పురుషుడు తాండవించిన వేళ.. వీరభద్రుడి ఆగమనం.. పాపనాశనం తథ్యం” అంటూ ఓ గంభీరమైన వాయిస్ ఓవర్ కూడా ఈ ప్రోమోలో వినిపిస్తోంది.

పాత తరం కల్ట్ కథలకు మోడ్రన్ టెక్నికల్ వాల్యూస్ తోడైతే స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ఈ ప్రోమోతో ప్రూవ్ చేశారు. ఒక రహస్యం చుట్టూ తిరిగే కథ కావడం, అందులోనూ వీరభద్రుని టెంపుల్ లేదా డివోషనల్ మిస్టరీ టచ్ ఉండటంతో ఫ్యాంటసీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

ఈ మధ్య ఆహా, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా లాంగ్ ఫార్మాట్ వెబ్ సిరీస్ లను తీసుకొస్తున్నాయి. అయితే జీ5 మాత్రం డివోషనల్, హారర్ టచ్ ఉన్న ఈ సిరీస్ తో ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతివారం కొత్త ఎపిసోడ్లు అంటూ మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More