ఇంటర్నెట్‌లో వెయిట్ లాస్ చిట్కాలకు కొదవ లేదు. అయితే, చాలా ప్లాన్‌లు పాటించడం కష్టంగా ఉంటాయి. కానీ అంజలి సచన్ అనే కంటెంట్ క్రియేటర్ పంచుకున్న చిట్కాలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండటంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె తన వెయిట్ లాస్ జర్నీలో ఎటువంటి ఖరీదైన ‘హెల్త్ ప్రొడక్ట్స్’ వాడకుండా, ఇంటి భోజనంతోనే ఈ విజయం సాధించడం విశేషం.
అసలు రహస్యం: క్యాలరీ డెఫిసిట్..

బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించేది 'క్యాలరీ డెఫిసిట్'. అంటే మన శరీరం రోజూ ఖర్చు చేసే క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలను ఆహారం ద్వారా తీసుకోవడం. అంజలి తన ప్రయాణంలో దీనినే ప్రధాన సూత్రంగా పెట్టుకున్నారు. దీనికి తోడు ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఆకలిని అదుపులో ఉంచుకున్నట్లు ఆమె తెలిపారు.
అంజలి అనుసరించిన 12 కఠినమైన నియమాలు..
క్రమశిక్షణతో కూడిన జీవనశైలే తన మార్పుకు కారణమని చెబుతూ, ఆమె ఈ కింది 12 సూత్రాలను పంచుకున్నారు:
క్యాలరీ డెఫిసిట్: తీసుకునే ఆహార పరిమాణంపై నియంత్రణ.
ప్రోటీన్ + ఫైబర్: ప్రతి పూట భోజనంలో ఇవి తప్పనిసరి.
లో-కార్బ్: పిండి పదార్థాలను తగ్గించడం.
చక్కెరకు స్వస్తి: స్వీట్లు, కూల్ డ్రింక్స్‌కు పూర్తిగా దూరం.
తక్కువ నూనె, ఉప్పు: ఆహారంలో వీటి వాడకాన్ని బాగా తగ్గించారు.
15 వేల అడుగులు: ప్రతిరోజూ 15,000 అడుగులు నడవడం.
ఫాస్టింగ్: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం.
వెయిట్ ట్రైనింగ్: కండరాల బలం కోసం వెయిట్ లిఫ్టింగ్ చేయడం.
సమయానికి నిద్ర: కనీసం 7-8 గంటల గాఢ నిద్ర.
{{/usCountry}}సమయానికి నిద్ర: కనీసం 7-8 గంటల గాఢ నిద్ర.
{{/usCountry}}ఓఎంఏడీ (వన్ మీల్ ఏ డే): అవసరమైనప్పుడు రోజుకు ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం.
6 గంటలకే డిన్నర్: రాత్రి 6 గంటల తర్వాత ఏమీ తినకపోవడం.
స్నాక్స్‌కు నో: అనవసరమైన చిరుతిళ్లు, స్నాక్స్‌ను పూర్తిగా మానేయడం.
7 రోజుల డైట్ ప్లాన్ (వెజ్ అండ్ నాన్-వెజ్)..
ఆమె తన ఫాలోవర్ల కోసం ఒక వారపు డైట్ చార్ట్‌ను కూడా అందించారు:
శాకాహారులకు: పనీర్ భుర్జీ, తోఫు, సోయా చంక్స్, మొలకల సలాడ్, గ్రీక్ యోగర్ట్, పెసరట్టు (మూంగ్ దాల్ చీలా), రాజ్మా, వెజిటబుల్ సూప్.
మాంసాహారులకు: గుడ్లు, చికెన్, చేపలు, ఓట్స్ విత్ వే ప్రోటీన్, చికెన్ సలాడ్ మరియు ఎగ్ భుర్జీ.
నిపుణుల హెచ్చరిక..
అంజలి సచన్ సాధించిన మార్పు స్ఫూర్తిదాయకమే అయినప్పటికీ, నిపుణులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో (నెలకు 10 కిలోలు) బరువు తగ్గడం అందరి శరీర తత్వాలకు సరిపడకపోవచ్చు! ఏదైనా డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు మీ శరీర రకం, జీవనశైలి, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.